
బైడెన్.. ట్రంప్.. గెలుపు ఎక్కడెక్కడంటే
వాషింగ్టన్: అగ్రరాజ్య అధ్యక్ష భవనం శ్వేతసౌధంలోకి అడుగు పెట్టేందుకు జో బైడెన్‌కు దాదాపు మార్గం సుగమమైంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. బైడెన్ 264 ఎలజిక్టోరల్ ఓట్లతో మ్యాక్ ఫిగర్(270)కు అత్యంత చేరువలో ఉన్నారు. మిషిగన్, విస్కన్సిన్ లాంటి నిర్ణయాత్మక రాష్ట్రాల్లో గెలిచి అధ్యక్ష పీఠానికి బాటలు వేసుకుంటున్నారు. అటు ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్ల దగ్గర ఆగిపోయారు. ఇంకా ఫలితాలు వెలువడాల్సిన ఐదు రాష్ట్రాల్లోని కొన్నింట్లో ట్రంప్, బైడెన్ మధ్య గట్టి పోటీ నెలకొంది. చాలా రాష్ట్రాల్లో ఊహించని విధంగా డెమొక్రాటిక్ పార్టీ ఆధిక్యం కనబర్చింది. దీంతో ఫలితాలపై ట్రంప్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కౌంటింగ్ ఆపాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా.. రాష్ట్రాల వారీగా డెమొక్రాటిక్ అభ్యర్థి బైడెన్, రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ఏయే రాష్ట్రాల్లో విజయం సాధించారో చూద్దాం..
రాష్ట్రం | ఎలక్టోరల్ ఓట్లు | గెలుపు |
అలబామా | 9 | ట్రంప్ |
అర్కాన్సాస్ | 6 | ట్రంప్ |
అరిజోనా | 11 | బైడెన్ |
కాలిఫోర్నియా | 55 | బైడెన్ |
కొలరాడో | 9 | బైడెన్ |
కనెక్టికట్ | 7 | బైడెన్ |
డెలావేర్ | 3 | బైడెన్ |
ఫ్లోరిడా | 29 | ట్రంప్ |
హావాయి | 4 | బైడెన్ |
ఐయోవా | 6 | ట్రంప్ |
ఇదాహో | 4 | ట్రంప్ |
ఇల్లినాయిస్ | 20 | బైడెన్ |
ఇండియానా | 11 | ట్రంప్ |
కాన్సస్ | 6 | ట్రంప్ |
కెంటుకీ | 8 | ట్రంప్ |
లూయీసియానా | 8 | ట్రంప్ |
మసాచుసెట్స్ | 11 | బైడెన్ |
మేరిలాండ్ | 10 | బైడెన్ |
మిషిగాన్ | 16 | బైడెన్ |
మిన్నెసొటా | 10 | బైడెన్ |
మిస్సోరీ | 10 | ట్రంప్ |
మిస్సిస్సీపీ | 6 | ట్రంప్ |
మోంటానా | 3 | ట్రంప్ |
నార్త్ డకోటా | 3 | ట్రంప్ |
న్యూ హాంప్‌షైర్ | 4 | బైడెన్ |
న్యూజెర్సీ | 14 | బైడెన్ |
న్యూ మెక్సికో | 5 | బైడెన్ |
న్యూయార్క్ | 29 | బైడెన్ |
ఓహైయో | 18 | ట్రంప్ |
ఓక్లహోమా | 7 | ట్రంప్ |
ఓరిగాన్ | 7 | బైడెన్ |
రోడీ ఐలాండ్ | 4 | బైడెన్ |
సౌత్ కరోలినా | 9 | ట్రంప్ |
సౌత్ డకోటా | 3 | ట్రంప్ |
టెన్నిసీ | 11 | ట్రంప్ |
టెక్సాస్ | 38 | ట్రంప్ |
ఉతాహ్ | 6 | ట్రంప్ |
వర్జీనియా | 13 | బైడెన్ |
వెర్మాంట్ | 3 | బైడెన్ |
వాషింగ్టన్ | 12 | బైడెన్ |
విస్కాన్సిన్ | 10 | బైడెన్ |
వెస్ట్ వర్జీనియా | 5 | ట్రంప్ |
వ్యోమింగ్ | 3 | ట్రంప్ |