AAA: ఏపీ అమెరికన్‌ అసోసియేషన్‌(AAA) ఫీనిక్స్‌ చాప్టర్‌ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ అమెరికన్‌ అసోసియేషన్‌ (AAA) ఫీనిక్స్‌ చాప్టర్‌ ప్రారంభమైంది.

Published : 11 Jul 2024 14:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌ అమెరికన్‌ అసోసియేషన్‌ (AAA) ఫీనిక్స్‌ చాప్టర్‌ ప్రారంభమైంది. అరిజోనా రాష్ట్రం  ఫీనిక్స్‌లోని డీ బాంక్వెట్‌ హాల్‌లో నిర్వహించిన మొట్టమొదటి సమావేశం విజయవంతమైంది. కల్యాణ్‌ గొట్టిపాటి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమాశంలో సుమారు 100 పాల్గొన్నారు.  వాసు కొండూరు ప్రసంగంతో సమావేశం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నాగ పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. 

AAA నాయకత్వ బృందం హరి మోతుపల్లి (AAA వ్యవస్థాపకులు), గవర్నరింగ్‌ బోర్డు సభ్యులు బాలాజీ వీర్నాల, కల్యాణ్ కార్రీ, రవి చిక్కాల, గిరీష్ అయ్యప్ప (New Jersey చాప్టర్ అధ్యక్షుడు), సత్య వేజ్జు (ప్రెసిడెంట్-ఎలెక్ట్, New Jersey), వీరభద్ర శర్మ (Pennsylvania చాప్టర్ అధ్యక్షుడు), ప్రదీప్ సెట్టిబలిజ (Delaware చాప్టర్ అధ్యక్షుడు), హరి తూబాటి (Delaware ప్రెసిడెంట్-ఎలెక్ట్) తదితరులు సంస్థ లక్ష్యాలను వివరించారు.  అమెరికాలో ఆంధ్రుల సంస్కృతీ సంప్రదాయాలను ప్రోత్సహించేందుకు, బలమైన సామాజిక భావనను పెంపొందించేందుకు దీన్ని స్థాపించినట్లు చెప్పారు. లోతైన సాంస్కృతిక బంధం కోసం ఒక వేదిక కావాలన్నదే ఉద్దేశమన్నారు.  తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను సంరక్షణ, వాటి ప్రాముఖ్యతపై చర్చించారు. భోగి, సంక్రాంతి, ఉగాది, శ్రీరామ నవమి తదితర పండుగల విశిష్టతపై ప్రసంగించారు. ఈ విధమైన కార్యక్రమాలను మరిన్ని నిర్వహించి భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు.  ఈ కార్యక్రమంలో జయరాం కోడె, మధు అన్నె, నరేంద్ర పర్వతరెడ్డి, నాగేంద్ర ఉప్పర, రమేశ్‌కుమార్‌ సూరపురెడ్డి, రాజమోహన్‌ సందెళ్ల, పుల్లారావు గ్రంథి, సాయిబాబు, భాను తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని