కువైట్‌లో తెదేపా ఆధ్వర్యంలో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు

కువైట్‌లో ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి ఛైర్మన్‌ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

Updated : 12 Jun 2022 12:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి ఛైర్మన్‌ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెదేపా కువైట్‌ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకరరావు ఆధ్వర్యంలో సాల్మియా ఏరియాలో ఉన్న అవంతి ప్యాలెస్‌ హోటల్లో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు, తెదేపా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సుధాకరరావు మాట్లాడుతూ.. బాలకృష్ణ గొప్ప మనసున్న వ్యక్తి అని కొనియాడారు. తల్లి బసవతారకం పేరు మీద ఉన్న క్యాన్సర్‌ ఆస్పత్రి ద్వారా ఎంతో మందికి ఉచిత వైద్యం అందిస్తూ ప్రాణాలు కాపాడుతున్నారన్నారు. భగవంతుడి ఆశీస్సులతో బాలకృష్ణ మరిన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. తెదేపా కువైట్‌ పీఆర్వో ఈశ్వర్‌ నాయుడు మాట్లాడుతూ కువైట్‌లో అందరికీ బాలయ్య అంటే అభిమానమని.. ఆయన డైలాగులు వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈడుపుగంటి దుర్గాప్రసాద్, దుగ్గి శ్రీను, చాన్ బాషా, బోయపాటి శ్రీను, సుబ్బారెడ్డి, కొల్లి ఆంజనేయులు, పెంచల్ రెడ్డి, తుంగ రాఘవ, కోనంగి మల్లికార్జున, చిన్న రాజు, బల్లాపురం మల్లయ్య, మచూరి శివ, సంతోష్, వేణు, వంశీ కృష్ణ కాపెర్ల తదితరులు కేక్ కట్ చేసి బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని