Updated : 10 Aug 2022 12:36 IST

‘అల సింగపురంలో..’ లఘుచిత్రం విడుదల

సింగపూర్‌: సింగపూర్‌లోని తెలుగు టీవీ ఆధ్వర్యంలో తీసిన ‘అల సింగపురంలో’ లఘు చిత్రం శనివారం విడుదలైంది. ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ లఘుచిత్ర విడుదల కార్యక్రమానికి ప్రముఖ సినీ రచయిత భువన చంద్ర, సినీ దర్శకులు వీఎన్ ఆదిత్య ముఖ్యఅతిథులుగా హాజరై... సింగపూర్‌ తెలుగు టీవీ ఛానల్‌ ద్వారా షార్ట్‌ ఫిలింను విడుదల చేశారు. ఈ చిత్రానికి రచన, నటన, దర్శకత్వం మొదలగు అన్ని సాంకేతిక రంగాలలో పనిచేసినవారంతా సింగపూర్‌లో నివసించే తెలుగువారే కావటం విశేషం. 

సింగపూర్ తెలుగు టీవీ వ్యవస్థాపకులు శ్రీగణేశ్న రాధాకృష్ణ మాట్లాడుతూ.. తన కలకు ప్రతిరూపంగా సింగపూర్లో నివసించే తెలుగువారిలో ఉన్న ప్రతిభను సద్వినియోగం చేస్తూ ఈ లఘుచిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఇందుకు సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య అతిథులు భువనచంద్ర, వి.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ.. ‘నటులు, దర్శకులు, రచయిత, కెమెరామెన్, అన్ని సాంకేతిక విభాగాల వారు ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. ప్రత్యేకించి కథ, దానిని తెరకెక్కించిన విధానం చాలా బాగుంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రావాలని ఆకాంక్షించారు.

చిత్రానికి కథ, సంభాషణలు అందించిన రాధిక మంగిపూడి మాట్లాడుతూ.. ‘సింగపూర్‌లో నివసించే తెలుగువారి కుటుంబాల్లో ఉండే ఆలోచనా విధానం, భారతీయ సంస్కృతితో వారు అనుసంధానమయ్యే తీరు వంటి అంశాలపై అన్ని దేశాల్లోని తెలుగువారిని ఆకట్టుకునే విధంగా ఈ కథను రూపొందించే ప్రయత్నం చేశాం’ అని తెలిపారు. దర్శకత్వం, కెమెరా, ఎడిటింగ్ విభాగాలకు రాధాకృష్ణ సేవలందించగా, ధవళ కళ్యాణ్ సహ దర్శకులుగా ఈ చిత్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. కాత్యాయిని గణేశ్న ఆడియో సహకారం అందించగా.. గౌరవ సలహాదారులు, పర్యవేక్షకులుగా కవుటూరు రత్నకుమార్ తమ వంతు సహాయం అందించారు. సింగపూర్‌లో లావణ్య, భరద్వాజ్ దంపతుల గృహంలో ఈ చిత్రం షూటింగ్ మొత్తం రెండు రోజుల్లో పూర్తి చేశారు. రామాంజనేయులు, కామేశ్వరి, భార్గవి, రాజశేఖర్, శివరంజని, సంతోష్, శాంత, వైష్ణవి, ఆశ్రిత, భరత్, ప్రతీక్ నటీనటులుగా 23 నిమిషాల పాటు నిడివి ఉన్న ఈ లఘు చిత్రం విడుదలైన కొద్ది సేపటికే ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. 

ఈ లఘు చిత్రం కోసం క్లిక్‌ చేయండి ‘అల సింగపురంలో’

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని