ప్రవాస భారతీయులందరికీ ఓటు హక్కు కల్పించాలి : శివానీ జాగర్లమూడి

ప్రవాస భారతీయులకూ ఓటు వేసే అవకాశాన్ని కల్పించాలని శివానీ జాగర్లమూడి కోరారు. ‘ఎన్నారై మహిళా విభాగం’, ‘ఏపీ ఎన్నారై యూఎస్‌ఏ’ ఆధ్వర్వంలో తమ ఆకాంక్షను పీఎంవో దృష్టికి తీసుకెళ్లామని ఆమె చెప్పారు.

Published : 16 Aug 2023 22:34 IST

అట్లాంటా : ప్రవాస భారతీయులందరికీ ఓటు వేసే అవకాశాన్ని కల్పించాలని శివానీ జాగర్లమూడి విజ్ఞప్తి చేశారు. ‘ఎన్నారై మహిళా విభాగం’, ‘ఏపీ ఎన్నారై యూఎస్‌ఏ’ ఆధ్వర్వంలో తమ ఆకాంక్షను పీఎంవో దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఇందుకు సంబంధించిన విజ్ఞాపన పత్రాలను భారతీయ దౌత్య కార్యాలయాల్లో సమర్పించామని వెల్లడించారు. భారతీయులందరికీ బ్యాలెట్ ఓటు/ప్రాక్సీ ఓటు అవకాశాన్ని కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశామన్నారు. జీవనోపాధి కోసం ఇతర దేశాల్లో నివాసం ఉంటున్నప్పటికీ తామంతా భారతీయులమని చెప్పడానికి గర్వపడుతున్నామన్నారు. విజ్ఞాపన పత్రాలను అందజేసే కార్యక్రమానికి సహకరించిన ప్రవాస భారతీయుడు కోమటి జయరామ్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అట్లాంటాలో నిర్వహించిన కార్యక్రమానికి సుధాకర్ బొబ్బ సహకరించారని, వివిధ నగరాల్లో జరిగిన కార్యక్రమాలను రవి కిషోర్ లామ్‌ సమన్వయ పరిచినట్లు పేర్కొన్నారు. 

అమెరికాలోని ప్రవాసులకు తప్పనిసరిగా ఓటు హక్కు కల్పించాలని ‘ఎన్నారై మహిళా విభాగం’, ‘ఏపీ ఎన్నారై యూఎస్‌ఏ’ సంఘాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రవాస భారతీయులందరి ఆకాంక్షను వెల్లడించే కార్యక్రమానికి ఎన్నారైలు శ్రీకారం చుట్టారు. తమ నివాస పరిధిలోని ఇండియన్ కాన్సులేట్ అధికారులను కలిసి బ్యాలెట్ ఓటు/ప్రాక్సీ ఓటును కల్పించాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు. అట్లాంటా, వాషింగ్టన్ డీసీ, చికాగో, న్యూయార్క్ వంటి నగరాల్లోని ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

అట్లాంటాలో శివానీ జాగర్లమూడి ఆధ్వర్యంలో.. శ్రీవాణి సుష్మా వడ్లపూడి, గిరిజ గొల్లపూడి, భార్గవి గొల్లపూడి, అరుణ నల్లపనేని తదితరులు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. వాషింగ్టన్ డీసీలో రవి కిషోర్ లామ్, దేవి సుధా మొవ్వ, మన్‌దీప్‌ లామ్, భాను మాగులూరి, చరణ్ గుడివాడ, కృష్ణ లామ్, నిరంజన్ వడ్లమూడి, లీల యడ్లపల్లి, కిషోర్ కొడాలి, శివ మొవ్వ, కృష్ణ విడియాల, అభినవ్ నార్నె, నరేష్ కుక్కపల్లి, పవన్ గద్దె, రఘు పెండ్యాల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చికాగోలో హేమ కానూరు, రవి కాకర, శ్రీనివాస్ పెద్దమల్లు, విజయ్ కొర్రపాటి, వెంకట్ యలమంచిలి, రఘు చిలుకూరి చిరంజీవి గల్లా, కృష్ణ మోహన్ చల్లా పాలుపంచుకున్నారు. న్యూయార్క్‌లో కార్తీక్ నాదెళ్ల, విష్ణుప్రియ పాలడుగు, మధు కుమార్ నాయుడు పరిటాల, దీపక్ రెడ్డి కూరెళ్ల, లోకేశ్‌ ఘంటా, అన్విత విజ్ఞాపన పత్రాలు అందించే కార్యక్రమాలను నిర్వహించారు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు