CDC: భారత్‌కు ప్రయాణ రేటింగ్‌ను సడలించిన అమెరికా సీడీసీ

భారత్‌తోపాటు మరికొన్ని దేశాల ప్రయాణాలపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది.

Published : 29 Mar 2022 23:35 IST

కొవిడ్‌ ఉద్ధృతి తగ్గిన నేపథ్యంలో తాజా మార్గదర్శకాలు

వాషింగ్టన్‌: రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా వైరస్‌ ప్రభావం నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ముఖ్యంగా కొవిడ్‌ కట్టడికి విధించిన కఠిన ఆంక్షలను పూర్తిగా సడలించే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఉన్న ఆంక్షలను తొలగిస్తున్నాయి. ఇందులో భాగంగా భారత్‌తోపాటు మరికొన్ని దేశాల ప్రయాణాలపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) భారత్‌కు ఇచ్చిన రేటింగ్స్‌ను సడలించింది.

కరోనా వైరస్‌ ఉద్ధృతి అధికంగా ఉన్న కారణంగా అమెరికా నుంచి భారత్‌ వెళ్లే ప్రయాణికుల కోసం ‘లెవల్‌ 3’ అలెర్ట్‌ కొనసాగిస్తోంది. తాజాగా ఈ స్థాయిని లెవల్‌-1 కి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. భారత్‌తోపాటు ఛాద్‌, గనియా, నమీబియా ప్రయాణ రేటింగ్స్‌ను కూడా లెవల్‌ 1 గా మార్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని