తెలుగు పాటల సౌధానికి పునాది ఘంటసాల: గేయ రచయిత అనంత్ శ్రీరామ్

అమరగాయకుడు ఘంటసాల తెలుగు పాటకి చిరునామా కాదని, తెలుగు పాటల సౌధానికి పునాది లాంటి వారని

Published : 14 Sep 2022 20:11 IST

సింగపూర్‌: అమరగాయకుడు ఘంటసాల తెలుగు పాటకి చిరునామా కాదని, తెలుగు పాటల సౌధానికి పునాది లాంటి వారని అన్నారు సినీ గేయ రచయిత అనంత్‌ శ్రీరామ్‌. పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి వేడుకలు సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదం ఊపందుకున్న విషయం విదితమే. శంకర నేత్రాలయ యు.ఎస్.ఏ. అధ్యక్షుడు బాలరెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో పలు చర్చా కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఘంటసాల గొంతు మోగిన తర్వాతే తెలుగు పాట  ప్రపంచ వ్యాప్తం కావడం మొదలయ్యింది. భాషతో ఏ మాత్రం సంబంధం లేని దేశాలలో కూడా ఆయన ప్రదర్శన అక్కడ ప్రజల్ని ఆకట్టుకుంది. చిన్నప్పటి నుంచి ఘంటసాల పాటలు వింటూ పెరిగా. ఇలాంటి గాయకుడు ఉండటం వల్లే తెలుగు భాష ఇంత పరిఢవిల్లుతోంది. ఆయన మన గాయకుడు కావటం తెలుగు వారి అదృష్టం. చరిత్రలో ముగ్గురే ముగ్గురు వ్యక్తులు వాళ్ళు మరణిస్తూ కూడా భవిష్యత్ తరాలకు లాభాలు చేకూర్చిన వారు ఉన్నారు, ఒకరు భీష్ముడు తనకు తెలిసిన ధర్మార్థ శాస్త్రాల అన్నిటి సారాన్ని  శ్లోకాల రూపంలో అందిస్తే, తరువాత ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర అనే ఒక అద్భుతమైన పరిశోధన  గ్రంథాల సమూహాన్ని రచించి మన తెలుగు జాతికి వదిలి వెళ్లారు. ఆ కోవలోకి చెందిన మూడో వ్యక్తి ఘంటసాల.  ఆయనకు భారతరత్న రావాలని ఆకాంక్షిస్తున్నా’’అని అన్నారు.

శత గళార్చన  నాలుగు భాగాల స్వాగతోపన్యాసంతో అలరించిన శారద ఆకునూరి  (హ్యూస్టన్, USA), ఈ చివరి భాగంలో తన  బృందం నుంచి వరప్రసాద్ బాలినేని, పేరూరి వెంకట సోమశేఖర్, కృష్ణ నాలాది, రాజశేఖర్ సూరిభొట్ల, సురేష్ ఖాజా, జ్యోతిర్మయి బొమ్ము, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, రమణ జువ్వాది, సత్యనారాయణ ఉల్మురి, ఉష మోచెర్ల,  పాల్గొని ఘంటసాల పాటలు పాడి ఘంటసాలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో శ్యామ్ అప్పాలి (లాస్ ఏంజెలెస్, USA) బృందం నుంచి సాయి కాశీభొట్ల, శ్రీనివాస్ రాణి, ప్రసాద్ పార్థసారధి, సుధాకర్ పంగనామముల, వర్మ అల్లూరి, శ్రీహర్ష, శ్రీవల్లి శ్రీధర్, శ్రీయాన్ కంసాలి, ఆదిత్య కార్తీక్ ఉపాధ్యాయుల,  అనూష వెన్నల, గౌరిధర్ మధు, రాజ్యలక్ష్మి వుదాతు, మీనాక్షి అనిపిండి, శాంత సుసర్ల, రఘు చక్రవర్తి, శ్రీధర్ జూలపల్లి, హరీష్ కొలపల్లి, నారాయణరెడ్డి ఇందుర్తి, వంశీకృష్ణ ఇరువరం పాల్గొని ఘంటసాల పాటలు పాడి స్మరించుకున్నారు. శ్యామ్‌ అప్పాలి శత గళార్చన 4 భాగాలకు సాంకేతిక సహాయాన్ని కూడా అందించారు.

శతగళార్చన కార్యక్రమంపై ఘంటసాల సతీమణి సావిత్రమ్మ, వారి కోడలు కృష్ణ కుమారి మాట్లాడుతూ ‘ఘంటసాలకు భారతరత్న’ కోసం కృషి చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. విశిష్ట అతిథులు ప్రముఖ దర్శకుడు సుకుమార్, ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, ప్రముఖ రచయిత, నటులు దర్శకులు తనికెళ్ళ భరణి, ప్రముఖ గేయ రచయితలు చంద్రబోస్ మరియు అనంత శ్రీరామ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. చివరిగా ఇన్ని కార్యక్రమాలను విజయవంతం నిర్వహించిన బాలరెడ్డి ఇందుర్తి, రత్న కుమార్ కవుటూరు ధన్యవాదములు తెలియచేశారు. ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్య స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు, వివరాలు మీ అందరి కోసం: https://www.change.org/BharatRatnaForGhantasalaGaru

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని