గంగా పుష్కరాలు.. కాశీలో ‘తానా’ ఆధ్వర్యంలో అన్నదానం

గంగా పుష్కరాల సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీలో పలు తెలుగు సంస్థలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నాయి.

Published : 23 Apr 2023 12:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గంగా పుష్కరాల సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీలో పలు తెలుగు సంస్థలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నాయి. దీనిలో భాగంగా అమెరికాలోని ప్రముఖ తెలుగు సంస్థ ‘తానా’ ఆధ్వర్యంలో శనివారం భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. పుష్కరాల ప్రారంభం సందర్భంగా స్థానిక శివాల ఘాట్‌లో అన్నదాన శిబిరం ఏర్పాటు చేశారు. తొలిరోజు సుమారు 800 మందికి పది పదార్థాలతో కూడిన చక్కటి భోజనాన్ని ‘తానా’ సభ్యులు వడ్డించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు