ఘనంగా ముగిసిన ‘ఆప్త’ వేడుకలు.. ఉర్రూతలూగించిన మణిశర్మ సంగీత విభావరి
మూడు రోజుల పాటు విందు వినోదాలతో, ఆట పాటలతో, రాజకీయ, వ్యాపార, సాంస్కృతిక కార్యక్రమాలతో కన్నులపండుగగా జరిగిన ఆప్త 15వసంతాల సంబరాలు ముగిశాయి.
అట్లాంటా: మూడు రోజుల పాటు విందు వినోదాలతో, ఆట పాటలతో, రాజకీయ, వ్యాపార, సాంస్కృతిక కార్యక్రమాలతో కన్నులపండుగగా జరిగిన ఆప్త 15వసంతాల సంబరాలు ముగిశాయి. ఈ వేడుకల్లో వద్దిపర్తి పద్మాకర్ అష్టావధానంతో చివరి రోజు కార్యక్రమాలు మొదలయ్యాయి. 8 మంది పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఛలోక్తులు విసురుతూ ఇచ్చిన సమాధానాలు ప్రేక్షకుల ప్రత్యేక మన్ననలు అందుకున్నాయి. జనసేన నేతలు సత్య బొలిశెట్టి, డాక్టర్ హరి ప్రసాద్, బండ్రెడ్డి రామ్‌లతో నిర్వహించిన పొలిటికల్ ఫోరమ్, తెలంగాణ భాజపా నేత బండి సంజయ్‌తో మీట్ అండ్ గ్రీట్, కళ్యాణ్ దిలీప్ సుంకర సామాజిక, రాజకీయ విశ్లేషణలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చివరిగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ తన సంగీత విభావరితో ప్రేక్షకులని ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చివరి రోజు దాతలను, కన్వెన్షన్ కమిటీలలో కృషి చేసిన వారిని, ఆప్త ఎగ్జిక్యూటివ్ టీమ్‌లను సత్కరించారు. ఈ కార్యక్రమాలకు రాజకీయ, సినీ రంగాలనుంచి విచ్చేసిన ప్రత్యేక అతిథులు బొత్స సత్యనారాయణ, బండి సంజయ్, హరి ప్రసాద్ పసుపులేటి, రామ్ బండ్రెడ్డి, కళ్యాణ్ దిలీప్ సుంకర, కదిరి బాబురావు, మున్నా ధూళిపూడి, అంగన రాయ్, సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్, సంపత్ నంది, మెహరీన్, లయ, అనంత్ శ్రీరామ్, ఆస్కార్ విజేత చంద్రబోస్, సత్య బొలిశెట్టి, తదితురులకు ఆప్త అధ్యక్షులు ఉదయ్ భాస్కర్ కొట్టె, కన్వీనర్ విజయ్ గుడిసేవ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పలువురికి అవార్డుల ప్రదానం..
తొలిసారిగా ఆప్తలో ప్రవేశపెట్టిన ఆప్త పురస్కారాల కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ప్రెసిడెంట్స్ క్లబ్ (2008 నుంచి 2023 వరకు పని చేసిన ప్రెసిడెంట్స్) ఎంపిక చేసిన ప్రతిభావంతులైన వారికి ఈ పురస్కారాలను అందజేశారు. ఆప్త జీవిత సాఫల్య పురస్కారం - సుబు కోట, ఆప్త పరమ విశిష్ట విశ్వ సేవా పురస్కారం - సంకురాత్రి చంద్ర శేఖర్, ఆప్త విశిష్ట విశ్వ సేవా పురస్కారం- రంగిశెట్టి మంగబాబు, శ్రీహరి కోటెల, ఆప్త సేవా పురస్కారం 2019-20కి శ్రీధర్ శంకరరావు, 2021-22 ఏడాదికి గాను అనిల్ వీరిశెట్టికి, 2023కు గాను రవి ఎలిశెట్టికి ప్రదానం చేశారు. ఆప్త నాయకత్వ పురస్కారాన్ని ప్రసాద్ సమ్మెటకు అందజేసి గౌరవించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
2 నిమిషాల్లోనే 50 మ్యాథ్స్ క్యూబ్‌లు చెప్పేస్తున్న బాలిక..
-
పని ఒత్తిడి తట్టుకోలేక సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
-
స్ట్రాంగ్ రూమ్‌కు రంధ్రం.. నగల దుకాణంలో భారీ చోరీ..
-
బాలినేని X ఆమంచి
-
Iraq: పెళ్లి వేడుకలో విషాదం.. అగ్నిప్రమాదంలో 100 మందికి పైగా మృతి
-
‘నా పెద్ద కొడుకు’ అరెస్టుతో ఆకలి, నిద్ర ఉండడం లేదు