ఘనంగా ‘ఆప్త’ 15 వసంతాల వేడుకలు.. సినీ, రాజకీయ ప్రముఖుల సందడి

అమెరికాలోని అట్లాంటా మహానగరంలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోషియేషన్ (APTA) 15 వసంతాల వేడుకలు ఘనంగా జరిగాయి...

Published : 03 Sep 2023 20:36 IST

అట్లాంటా: అమెరికాలోని అట్లాంటా మహానగరంలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోషియేషన్ (APTA) 15 వసంతాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ అసోసియేషన్‌ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ సెప్టెంబర్‌ 1 నుంచి 3వరకు అట్లాంటాలోని గ్యాస్‌ సౌత్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో  ఏర్పాటు చేసిన జాతీయ సమావేశంలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు రాజకీయ, సినీ, వాణిజ్యరంగంలోని ప్రముఖులు విచ్చేశారు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 6గంటలకు కర్టెన్‌ రైజర్‌తో ప్రారంభమైన ఈ వేడుకల్లో తొలుత ప్రధాన దాతలు సుబ్బు కోట, విజయ్‌ ఉడిసెవా, ఉదయ్‌ భాస్కర్‌ కొట్టె, శ్రీని బైరెడ్డి, రావు రెమ్మల, రాజేష్‌ కళ్లేపల్లి, సూర్య, సత్య తోట, తదితరులను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో తొలిరోజు ప్రముఖ సినీ నటులు సమంత, సాయి ధరమ్‌తేజ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా రఘు కుంచెతో ఏర్పాటు చేసిన సంగీత విభావరి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈ వేడుకల్లో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, తెలంగాణ భాజపా నేత, ఎంపీ బండి సంజయ్‌, జనసేన నేత హరిప్రసాద్‌ పసుపులేటి, రామ్‌ బండ్రెడ్డి, కల్యాణ్‌ దిలీప్‌ సుంకర, సంగీత దర్శకులు కోటి, రఘు కుంచె, సినీ గేయ రచయిత అనంత్‌ శ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్‌ను ఘనంగా సన్మానించారు.

‘ఆప్త’ 15 ఏళ్ల వార్షికోత్సవాల్లో భాగంగా మరుసటి రోజు  ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆప్త అధ్యక్షుడు ఉదయ్‌ భాస్కర్‌ కొట్టె జ్యోతి ప్రజ్వలన చేసి పలు కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సావనీర్‌ను విడుదల చేశారు. క్రీడలు, ఫ్యాషన్‌ షోలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయగా పలువురు ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణం జరిపించారు. పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.  రెండో రోజు వేడుకల్లో బండి సంజయ్‌, హరిప్రసాద్‌, సత్య బొలిశెట్టి, కదిరి బాబూరావు, మున్నా ధూళిపూడి, అంగన రాయ్‌తో పాటు సాయి ధరమ్‌తేజ్‌, సందీప్‌ కిషన్‌, సంపత్‌ నంది, మెహరీన్‌, లయ తదితరులు పాల్గొని సందడి చేశారు.  మొత్తంగా ‘ఆప్త’ 15 ఏళ్ల సంబరాలు విందు, వినోదాలతో ఆట పాటలతో కన్నుల పండువగా జరిగాయి. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు