నాష్‌విల్‌లో ఉత్సాహంగా ‘ఆటా’ మహిళల షార్ట్ క్రికెట్ టోర్నమెంట్
అమెరికాలోని నాష్వె్‌లో ఆటా ఆధ్వర్యంలో మహిళల క్రికెట్‌షార్ట్ టోర్నమెంట్ ఉత్సాహంగా జరిగింది.
అమెరికా: అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా టెన్నసీ రాష్ట్రంలోని నాష్వెల్ నగరంలో అమెరికా తెలుగు సంఘం (ఆటా) తొలిసారి మహిళల షార్ట్ క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా జరిగింది. ఏప్రిల్ 8, 9 తేదీల్లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో తొమ్మిది మహిళా జట్లు పాల్గొన్నాయి. ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ పోటీలను వీక్షించేందుకు దాదాపు 300 మంది తరలివచ్చారు. ఈ పోటీలను ఆటా రీజినల్ కోఆర్డినేటర్లు క్రిష్ నూకల, సాయిరామ్ రాచకొండతో పాటు ఆటా నాష్వెల్ టీమ్ సభ్యులు భరద్వాజ్ సామల, సాయివర్థన్ రెడ్డి బోడా, అనూష వంగల, ఆనంద్ రామ్‌కుమార్, దిగ్విజయ్ వంగల, ప్రశాంతి రాచకొండ, వంశీ కొరిపెల్లి, రాకేష్ బెక్కంతో పాటు పలువురు వాలంటీర్లు విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమ నిర్వహణలో రామకృష్ణారెడ్డి ఆల (ఆటా కార్యదర్శి) , కిషోర్‌రెడ్డి గూడూరు (బీఓటీ సభ్యుడు), సుశీల్ చందా (విద్యాకమిటీ చైర్) , నరేందర్‌రెడ్డి నూకల ( ప్రాంతీయ సలహాదారుడు) తదితరులు కీలక పాత్ర పోషించారు.
ఆటా మహిళల షార్ట్ క్రికెట్ టోర్నమెంట్‌ను, నాష్వెల్ రైజర్స్ (విజేత జట్టు), పవర్ గర్ల్స్ (రన్నరప్ జట్టు) , TNMM (రెండో రన్నరప్ జట్టు ) జట్టులకు ఆటా ట్రోఫీలను ప్రదానం చేసింది. మహిళల అభిరుచి, క్రీడల పట్ల నిబద్ధతను పెంచేందుకు ప్రోత్సాహక పతకాలు అందజేశారు. ఆటా నాష్వెల్ బృందం ఆటా ఎగ్జిక్యూటివ్ టీమ్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలకు సమాజానికి సేవ చేయడానికి ఈ అద్భుతమైన అవకాశాన్ని అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన ఇండియా బజార్, ఛాయ్ సమోసా రెస్టారెంట్‌కు ఆటా సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
రాష్ట్రంలో త్వరలోనే క్రీడాపాలసీ
-
Sports News
Ambati Rayudu: చివరి మ్యాచ్‌లో రాయుడు మెరుపు షాట్లు.. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ముగింపు
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్
-
Crime News
Crime News: బాగా చదివి లాయర్ కావాలనుకుని.. ఉన్మాది చేతిలో కత్తి పోట్లకు బలైపోయింది