ఘనంగా ‘ఆటా’ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

అమెరిఆలోని గ్రేటర్‌ షార్లెట్‌ ఆఫ్‌ నార్త్‌కరోలినాలో ఆటా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

Published : 02 Apr 2023 15:13 IST

 

అమెరికా: గ్రేటర్ షార్లెట్ ఆఫ్ నార్త్ కరోలినాలోని అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA)ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.  మార్చి 26న బ్రిడ్జ్‌హాంప్టన్ క్లబ్‌హౌస్‌లో నిర్వహించిన ఈ వేడుకలకు దాదాపు 200మందికి పైగా మహిళలు తరలివచ్చారు. డాక్టర్లు, లాయర్లు, పారిశ్రామికవేత్తలు, గృహిణులు, సాంకేతిక నిపుణులు సహా అన్ని వర్గాల మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని హోస్ట్ అను పన్నెం ప్రారంభించగా..  ముఖ్య అతిథులుగా మాజీ మేయర్‌ జెన్నీఫర్ రాబర్ట్స్, డా.సుష్మ, డా.శోభ, డా.సుగన్య, డా.శశిలను మల్లిక స్వాగతించారు. అనంతరం రంజిత పాడిన భక్తిగీతానికి హాలంతా చప్పట్లతో మార్మోగింది. మాజీ మేయర్‌ జెన్నీఫర్ రాబర్ట్స్ మహిళలతో బాగా కనెక్ట్ అయ్యే విభిన్న అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.  ఈవెంట్‌ను ఆమె పూర్తిగా ఆస్వాదించారు.  ప్రశ్నోత్తరాలు.. కొన్ని పోటీలకు న్యాయ నిర్ణేతగా, నృత్యం..  ఇలా మన సంస్కృతిలో పూర్తిగా నిమగ్నమైపోయారు. ఇతర ముఖ్య అతిథులంతా  కొన్ని ఆరోగ్య చిట్కాలను సూచిస్తూ అద్భుత ప్రసంగాలు చేశారు.  ఈ కార్యక్రమం ATA టీమ్ రీజినల్ కో-ఆర్డినేటర్ క్రాంతి కుమార్ రెడ్డి ఏళ్ళ, వెంకట సబ్బసాని, శివా రెడ్డి కర్మూరు, స్టాండింగ్ కమిటీ శశిరెడ్డిల సహకారంతో విజయవంతంగా జరిగింది. బాలంటైన్ స్పోర్ట్స్ క్లబ్ జట్టు నుంచి వాలంటీర్లు అచ్యుత, శ్రీకర్,  రాజేందర్ తమ సహకారాన్ని అందజేశారు. ఈ వేడుకలు విజయవంతం కావడానికి సహకరించిన స్పాన్సర్స్‌కు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు