ఒహైయోలో ఘనంగా ‘ఆప్కో’ అట్లతద్ది వేడుకలు

అమెరికాలోని సెంట్రల్‌ ఒహైయోలో ఆంధ్రా పీపుల్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఒహైయో (ఆప్కో) తెలుగు ప్రజలు అట్లతద్ది వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. దాదాపు 60మంది మహిళలు సంప్రదాయ .....

Published : 25 Oct 2021 21:54 IST

ఒహైయో: అమెరికాలోని సెంట్రల్‌ ఒహైయోలో ఆంధ్రా పీపుల్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఒహైయో (ఆప్కో) ఆధ్వర్యంలో తెలుగు ప్రజలు అట్లతద్దిని వేడుకగా నిర్వహించారు. దాదాపు 60 మంది మహిళలు సంప్రదాయ పద్ధతిలో ఈ వేడుకలను ఉత్సాహంగా జరుపుకొన్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉండి శాస్త్రోక్తంగా గౌరీ పూజతో పాటు అన్ని పద్ధతులను నిష్ఠగా ఆచరించి వాయునాలు ఇచ్చిపుచ్చుకోవడంతో ఈ వ్రతాన్ని పూర్తి చేశారు. చంద్రోదయం తర్వాత 30కి పైగా ఆంధ్రా వంటకాలతో విందు భోజనాన్ని అంతా ఆస్వాదించారు. అనంతరం స్టార్‌ మహిళా వినోద కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐదుగురు మహిళలు విజేతలుగా నిలిచారు. 

అమెరికాలో ఈ విధంగా అట్లతద్ది వేడుకలు నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. గత రెండేళ్లుగా ఆప్కో వినూత్న కార్యక్రమాలతో అతి తక్కువ సమయంలో తెలుగు వారికి అత్యంత చేరువైన సాంస్కృతిక సేవా సంస్థ. ఈ కార్యక్రమం ఆ సంస్థ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షురాలు సుశీల ఉప్పుటూరి అధ్వరంలో విజయవంతంగా జరిగాయి. కమిటీ సభ్యులు వేణు పసుమర్తి, రవి నవులూరి, అపర్ణ సంగా, వాణి గద్దె, అనిత ఈడ్పుగంటి, ఉమ మునగాల, వీరేష్ ఊల్లిగడ్ల, రాజ బొమ్మన, వెంకట అరవీటి, నూకరాజు, లత సాదినేని, జయ యర్రంశెట్టి, మాధవి పుట్టితో పాటు పలువురు స్వచ్ఛంద సేవకులు అట్లతద్ది వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు