ఇది పక్కా ప్లాన్‌తో చేసిన దాడి: తెదేపా నేత కోమటి జయరాం 

తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడిని ఎన్నారై తెదేపా నేత కోమటి జయరాం ఖండించారు. ఈ ఘటనలు అత్యంత హేయమన్నారు. ఇవి రాజకీయ ప్రేరేపిత దాడులని, వైకాపా ఆధ్వర్యంలో ...

Updated : 20 Oct 2021 01:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడిని ఎన్నారై తెదేపా నేత కోమటి జయరాం ఖండించారు. ఈ ఘటనలు అత్యంత హేయమన్నారు. ఇవి రాజకీయ ప్రేరేపిత దాడులని, వైకాపా ఆధ్వర్యంలో పక్కా ప్లాన్‌తో చేసిన దాడులన్నారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా దాడులు జరుగుతున్నప్పటికీ.. పోలీసులు వాటిని అడ్డుకోకపోవడాన్ని బట్టి వీటి వెనుక ఎవరున్నారనేది చాలా స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. వైకాపా కార్యకర్తలు రాష్ట్రంలోని 13 జిల్లాలోని తెదేపా కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారన్నారు. పాలన చేతకాక గూండాగిరి చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభాన్ని సృష్టించిన వైకాపా ప్రభుత్వం దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక ఇలాంటి అరాచకాలకు పాల్పడుతోందన్నారు. 

దేశ వ్యాప్తంగా పలు చోట్ల పట్టుబడుతున్న గంజాయి వాహనాలు ఏపీ నుంచి వచ్చినవే అని ఆధారాలతో వార్తలు వస్తుంటే దానిని ప్రశ్నించడం తెలుగుదేశం తప్పా? దానికే దాడులు చేస్తారా? అని కోమటి జయరాం ప్రశ్నించారు. ఏం చేసినా ప్రతిపక్షాలు, ప్రజలు చేతులు ముడుచుకుని కూర్చోవాలా? అని ధ్వజమెత్తారు. ఇప్పటికే రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందని, పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయన్నారు. కొత్త పరిశ్రమలు రావట్లేదని, యువతకు ఉపాధి దొరకడం లేదన్నారు. ఆర్థిక, నిరుద్యోగ సంక్షోభంతో రాష్ట్రం విలవిల్లాడుతోందన్నారు. తాజాగా ఈ ఘటనలు రాష్ట్రాన్ని ఎటుతీసుకెళ్తాయోనని, ఇంకెంత నాశనం చేస్తాయో అర్థం కావడం లేదని ఆంధ్ర ఎన్నారైలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. అధికార పార్టీ మూకలను ఆపడానికి స్థానిక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరం అని కోమటి జయరాం విమర్శించారు. 

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts