Australia: మరిన్ని శాశ్వత వలసలను ఆహ్వానించనున్న ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియాకు శాశ్వతంగా వలస వచ్చేవారిని ప్రోత్సహించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆస్ట్రేలియాకు శాశ్వత వలసలను 35,000 నుంచి 1,95,000కు పెంచే అవ

Updated : 02 Sep 2022 12:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియాకు శాశ్వతంగా వలస వచ్చేవారిని ప్రోత్సహించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆస్ట్రేలియాకు శాశ్వత వలసలను 35,000 నుంచి 1,95,000కు పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా సిబ్బంది కొరతతో సమస్యలు ఎదుర్కొంటున్న వ్యాపారాలకు ఈ నిర్ణయంతో ఊరట లభించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆస్ట్రేలియా కొవిడ్‌కు భయపడి రెండేళ్లపాటు దేశ సరిహద్దులను మూసివేయడం, ఉపాధి కోసం వచ్చినవారు, విదేశీ విద్యార్థులు దేశాన్ని వీడటంతో  వ్యాపార సంస్థలకు అవసరమైన సిబ్బంది లభించడంలేదు. ‘‘మా వలస విధానాలను మార్చుకొనే అవకాశం కొవిడ్‌ కారణంగా లభించింది. ఈ అవకాశాన్ని మేము పూర్తిగా వాడుకోవాలని అనుకొంటున్నాం. దీని ప్రకారం మరింత మంది నర్సులు, వేలకొద్దీ ఇంజినీర్లు ఇక్కడ స్థిరపడనున్నారు’’ అని ఆస్ట్రేలియా హోం అఫైర్స్‌ మినిస్టర్‌ క్లారె ఓనీల్‌ వెల్లడించారు. మరోవైపు వీసా ప్రాసెసింగ్‌ను వేగవంతం చేసేందుకు వచ్చే తొమ్మిది నెలల్లో మరో 500 మంది సిబ్బందిని నియమించుకుంటామని ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్‌ మినిస్టర్‌ ఆండ్రూ గైల్స్‌ పేర్కొన్నారు.

ఆస్ట్రేలియాలో గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం తగ్గి 3.4శాతం వద్దకు చేరింది. కానీ, ద్ర్యవోల్బణం మాత్రం పెరిగింది. ఈ నేపథ్యంలో వలస విధానాలను మార్చాలని వ్యాపార సంస్థలు కోరుతున్నాయి. వార్షిక వలసలను 1,60,000కు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఇందుకోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం కాన్‌బెర్రాలో వ్యాపార, కార్మిక సంఘాలతో సమావేశమై పరిష్కార మార్గంపై చర్చించాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు నైపుణ్యంగల ఉద్యోగుల కోసం వలస నిబంధనలు సవరిస్తున్నాయి. ఇప్పుడు అదే బాటలో ఆస్ట్రేలియా కూడా నడవనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని