Veera Simha Reddy: ఆస్ట్రేలియాలో ‘వీర సింహారెడ్డి’ సందడి

నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రధాన పాత్రలో నటించిన ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy) సినిమా విడుదల సందర్భంగా ఆస్ట్రేలియాలోని పలు నగరాల్లో సందడి వాతావరణం నెలకొంది.

Published : 12 Jan 2023 14:51 IST

అడిలైడ్‌: నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రధాన పాత్రలో నటించిన ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy) సినిమా విడుదల సందర్భంగా ఆస్ట్రేలియాలోని పలు నగరాల్లో సందడి వాతావరణం నెలకొంది. అభిమాన నటుడి సినిమా కావడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌, బ్రిస్బేన్‌, అడిలైడ్‌ నగరాల్లోని పలు థియేటర్ల వద్ద బాలయ్య అభిమానుల ఉత్సాహంతో సందడి వాతావరణం నెలకొంది.

అడిలైడ్‌ నగరంలో కార్లతో ర్యాలీగా వెళ్లి సినిమా చూసిన అభిమానులు..

విజయోత్సాహంలో భాగంగా కేక్‌ కట్‌ చేసి వీర సింహారెడ్డి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. సినిమాలో బాలయ్యబాబు నటన ఆద్యంతం ఆకట్టుకునేలా ఉందన్నారు. జై బాలయ్య.. జైజై బాలయ్య.. అంటూ సినిమా థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేశారు.


Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు