ఆస్ట్రేలియా పార్లమెంట్‌ ముందు ఘనంగా బతుకమ్మ వేడుకలు

ACT తెలంగాణ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Published : 27 Sep 2022 12:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ACT తెలంగాణ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశ రాజధాని కానెబెర్రాలో పార్లమెంట్‌ ముందు నిర్వహించిన ఈ సంబరాల్లో మహిళలు తమ కుటుంబసభ్యులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలతో తరలివచ్చారు.

అనంతరం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా బతుకమ్మ ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు మనో పాల్గొని తన పాటలతో అలరించారు. దక్షిణ భారతదేశం తరఫున ఓ పండుగను ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో నిర్వహించిన ఘనత తెలుగువారికి దక్కినట్లు నిర్వాహకులు తెలిపారు. బతుకమ్మ పండుగ సంస్కృతి, విశిష్టతను తెలియజేయడమే ధ్యేయంగా ఈ వేడుకలు నిర్వహించామని.. భారీ స్పందన వచ్చిందని ACT తెలంగాణ అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని