Batukamma: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో.. యూకేలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యూకేలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. జాగృతి యూకే అధ్యక్షుడు సుమన్‌రావు బల్మూరి ఆధ్వర్యంలో లండన్‌లోని ఇల్ఫోర్డ్‌లో వరుసగా ఆరో సంవత్సరం బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ ఆరోగ్య సంచాలకులు శ్రీనివాసరావు హాజరయ్యారు.

Updated : 03 Oct 2022 20:11 IST

ఆకాశం విరిగిందా,  పువ్వుల వాన కురిసిందా , జన సంద్రం కదిలిందా, బతుకమ్మలకు అభిషేకంతో పుడమి పులకరించిందా అన్నంతంగా ఉంది ఈ సంబురం. ఇదేదో తెలంగాణ తెలంగాణలో కాదు.. ఇంగ్లాండ్‌ గడ్డమీద ప్రవాస తెలంగాణ బిడ్డల బతుకమ్మ పండుగ కోలాహలమిది.

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యూకేలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. జాగృతి యూకే అధ్యక్షుడు సుమన్‌రావు బల్మూరి ఆధ్వర్యంలో లండన్‌లోని ఇల్ఫోర్డ్‌లో వరుసగా ఆరో సంవత్సరం బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ ఆరోగ్య సంచాలకులు శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ పూల పండుగలో యూకే నలుమూలల నుంచి ప్రవాస తెలంగాణ మహిళలే కాకుండా ప్రవాస ఆంధ్ర, నార్త్‌ ఇండియన్స్‌, ఇతర దేశస్థులు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 4000 వేల మంది ఈ కార్యక్రమానికి విచ్చేశారు. దుర్గాదేవి పూజతో మొదలైన ఈ వేడుకలో తెలంగాణ జాగృతి గొప్పతనాన్ని వివరించారు. అనంతరం చిన్నారుల సాంస్కృతిక నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒకేసారి 2000 మంది బతుకమ్మ ఆడుతూ తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పారు.

ప్రతీ సంవత్సరం బతుకమ్మ పండుగ సమయంలో ఆడబిడ్డలకు సారె పొయ్యడం తెలంగాణ సంప్రదాయమని జాగృతి యూకే అధ్యక్షులు సుమన్‌రావు బల్మూరి అన్నారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా బతుకమ్మ ఆడేందుకు వచ్చిన మహిళలందరికీ చేనేత చీరలు, బియ్యం, పసుపు, కుంకుమ సారెగా ఇచ్చారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీనివాసరావు పెద్ద బతుకమ్మలు పేర్చిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇచ్చారు. అనంతరం అతిథులందరికీ తెలంగాణ ప్రత్యేక వంటకాలతో భోజనాలు పెట్టారు. హైదరాబాద్‌ దర్బార్‌ వారు ఉచితంగా భోజనాలను అందించారు. ఇలాంటి గొప్ప బతుకమ్మ కార్యక్రమం కేవలం జాగృతి యూకే మాత్రమే చేయగలదని, దానికి ఎమ్మెల్సీ కవిత స్ఫూర్తిగా నిలుస్తారని సుమన్‌రావు తెలిపారు. కేవలం పండగలు జరపడమే కాకుండా స్థానిక రోటరీ క్లబ్‌తో కలసి ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి సుమన్‌ బల్మూరితోపాటు మీడియా పీఆర్‌ వంశీ మునిగంటి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.


Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని