Published : 04 Apr 2022 20:01 IST

దిగ్విజయంగా ప్రారంభమైన ‘శ్రీమద్ భాగవత సప్తాహం’

సింగపూర్‌ ప్రధాన వేదికగా నిర్వహిస్తున్న ‘శ్రీమద్ భాగవత సప్తాహం’ కార్యక్రమం మొదటి రెండు రోజులు దిగ్విజయంగా పూర్తయ్యాయి. అక్కడి ప్రఖ్యాత తెలుగు సంస్థలైన, ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’, ‘తెలంగాణ కల్చరల్ సొసైటీ’, ‘తెలుగు భాగవత ప్రచార సమితి’, ‘కాకతీయ సాంస్కృతిక పరివారం’ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాల వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శుభకృత్ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని అవధాన సామ్రాట్ డా.మేడసాని మోహన్ సింగపూర్ తెలుగు వారి కోసం ప్రత్యేకంగా దీనిని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా భాగవత ప్రవచన కార్యక్రమ ప్రారంభోత్సవంలో శృంగేరి పీఠాధిపతులు విధుశేఖరానంద భారతిస్వామి, కుర్తాళం పీఠాధిపతి సిద్దేశ్వరానంద భారతిస్వాములు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీస్సులను అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్, భాజపా పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ముఖ్య అతిథిలుగా పాల్గొని సభకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

మొదటిరోజు భాగవత నేపథ్యం, ఆవిర్భావాన్ని గురించి రెండో రోజు మత్స్య, కూర్మ, వరాహ అవతార విశేషాలను డా. మేడసాని వివరించారు. కథా విశేషాలతో పాటు పోతన రచనా వైశిష్ట్యం, జీవితంలో మనకు ఉపయోగపడే విధంగా భాగవత కథలు నుంచి మనము నేర్చుకోవలసిన అంశాలను కళ్ళకు కట్టినట్లు భాగవతాన్ని వారు అభివర్ణించారు.

మొదటి రోజు నిర్వహించిన కార్యక్రమంలో భాజపా ఏపీ కోశాధికారి వామరాజు సత్యమూర్తి, రాజు వంశీ ఆర్ట్ థియేటర్స్ అధ్యక్షులు డా.వంశీ రామరాజు, మల్లిక్ పుచ్చా(అమెరికా), విజయ తంగిరాల(ఆస్ట్రేలియా), శ్రీలత మగతల(న్యూజిలాండ్), రవికుమార్ బొబ్బ(థాయిలాండ్), డా అచ్చయ్య రావు(మలేషియా), దీపిక రావి(సౌదీ అరేబియా)లతో పాటు భారత్ నుంచి తెలుగు భాగవత ప్రచార సమితి అధ్యక్షుడు ఊలపల్లి సాంబశివరావు దంపతులు, వివిధ దేశాల తెలుగు ప్రతినిధులు పాల్గొన్నారు.

రెండో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు డా.వంగూరి చిట్టెన్ రాజు పాల్గొని సభకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాన నిర్వాహకులు రత్నకుమార్ కవుటూరు, నీలం మహేందర్ ఊలపల్లి భాస్కర్, రాంబాబు పాతూరి, కార్యవర్గ సభ్యులు ప్రశాంత్ రెడ్డి, రమేష్ గడప, శ్రీనివాస్, సుబ్బు వి పాలకుర్తి, రామాంజనేయులు చామిరాజు తదితరులు డాక్టర్ మేడసానికి ఇతర అతిథులకు తమ కృతజ్ఞతలు తెలియజేసి ప్రపంచ నలుమూలల నుంచి తెలుగువారందరూ కలసి భాగవత వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, తమ కార్యక్రమాన్ని తప్పక వీక్షించమని ఆహ్వానించారు. రాధికా మంగిపూడి సభా నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించగా, గణేశ్న రాధాకృష్ణ సాంకేతిక నిర్వహణలో రోజూ ఏడు మాధ్యమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.


Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని