ఘనంగా 100 మందికి పైగా గాయకులతో ఘంటసాల శతగళార్చన

అమర గాయకుడు, ప్రముఖ సంగీత దర్శకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి వేడుకల సందర్భంగా ఆయనకి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో శంకర

Published : 25 Aug 2022 20:29 IST

సింగపూర్‌: అమర గాయకుడు, ప్రముఖ సంగీత దర్శకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి వేడుకల సందర్భంగా ఆయనకి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో శంకర నేత్రాలయ యూఎస్‌ఏ అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో 150 పైగా టీవీ చర్చ కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రముఖ దర్శకులు సుకుమార్, ప్రముఖ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, ప్రముఖ రచయిత, నటులు దర్శకులు తనికెళ్ళ భరణి, ప్రముఖ గేయ రచయితలు చంద్రబోస్, అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొని ఘంటశాల గొప్పతనాన్ని చాటిచెప్పారు. వీరితో పాటు, సహ నిర్వాహకులైన విజు చిలువేరు, రత్న కుమార్ కవుటూరు, శారద ఆకునూరి, రెడ్డి ఉరిమిండి, రామ్ దుర్వాసుల, ఫణి డొక్కా, శ్యాం అప్పాలి, నీలిమ గడ్డమణుగు, జయ పీసపాటి, శ్రీలత మగతలతో కలసి ప్రపంచ వ్యాప్తంగా 100 మంది పైగా గాయకులు / గాయనీమణులు తో  ఘంటసాల శత గళార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన మొదటి భాగం ఆగస్టు 21వ తేదీ నుంచి నిర్వాహకులు అందుబాటులోకి తెచ్చారు. మిగిలిన భాగాలు ఆగస్టు 28న, సెప్టెంబరు 4, సెప్టెంబరు 11వ తేదీల్లో ప్రసారం చేయనున్నారు.

ఈ సందర్భంగా, ఘంటసాల స్వగృహంలో కోడలు కృష్ణ కుమారి మాట్లాడుతూ.. రెండేళ్ల కిందట ఘంటసాల రత్నకుమార్ వంద కేంద్రాల్లో శతజయంతి కార్యక్రమాన్ని చేయాలనుకున్నారని తెలిపారు. ఆయన అకాల మరణంతో నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ఇంతటి బృహత్కార్యాన్ని చేపట్టిన నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

మొదటి భాగంలో పాల్గొన్న ముఖ్య అతిథులు తనికెళ్ళ భరణి మాట్లాడుతూ ఇంతటి విశ్వవేదికని పంచుకుంటున్న అందరికీ అభినందనలు తెలిపారు. ‘మిథునం’లో ఒక సన్నివేశంలో వచ్చిన ఘంటసాల ఆలపించిన పుష్పవిలాపం గురించి గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ వారి పాటతోనే అందరు మేల్కొంటారని, వారి స్వగ్రామానికి వెళ్లినప్పుడు అనిర్వచనీయమైన అనుభూతిని పొందానని చెప్పారు. ఘంటసాల ఒక పరిపూర్ణ గాయకుడు, మంచి సంస్కారం గల మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.  ప్రముఖ సినీ దర్శకులు  సుకుమార్  మాట్లాడుతూ.. ఘంటసాల మనందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు అని చెప్పడానికి నిదర్శనం ఇప్పటికి ప్రతి ఊరూ ఘంటాసాల పాటతోనే మేల్కొంటుందని పేర్కొన్నారు. ఘంటసాల శతజయంతి సందర్భంగా వారికి భారతరత్న ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.

శ్యాం అప్పాలి బృందం (మెల్ బోర్న్, ఆస్ట్రేలియా) సంధ్య ఈశ్వర, కళ్యాణి వల్లూరి, లలిత చింతలపాటి, కిరణ్ కొక్కిరి, ఫణి డొక్కా బృందం (బాస్టన్, యూఎస్‌ఏ) హరిని దర్భా, (ఇండియా) మృదురవళి దర్భా, మరియు జయ పీసపాటి బృందం ( హాంకాంగ్ ) హర్షిణీ పచ్చంటి, సుసర్ల సాయి జయంత్, నారాయణి గాయత్రి ఇయుణ్ణి, డా.సతీష్ కుమార్ పట్నాల, రోహన్ మార్కాపురం (యూఎస్‌ఏ) రోహిత్ విస్సంశెట్టి , (తైవాన్) డా.ఏకాంబర నెల్లూర్ ప్రకాష్, డా.సత్య చందు హరిసోమయాజుల, కన్నెగంటి వాసంతి దేవి పలువురు గాయకులు పాల్గొని ఘంటసాల పాటలు పాడి మరియు చక్కటి వ్యాఖ్యానంతో వారిని స్మరించుకున్నారు.  ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్య స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు, వివరాలు మీ అందరి కోసం: https://www.change.org/BharatRatnaForGhantasalaGaru ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి బాలరెడ్డి ఇందుర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేశారు. మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే, ghantasala100th@gmail.comకు సంప్రదించగలరని ఒక ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని