Updated : 12/03/2021 15:04 IST

జులై 4పై బైడెన్‌ దృష్టి..?

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాను కరోనావైరస్‌ రహిత దేశంగా మార్చేందుకు బైడెన్‌ సర్కారు వేగంగా చర్యలు చేపడుతోంది. మే1వ తేదీ నుంచి దేశంలోని పెద్దవాళ్లందరూ టీకాలు తీసుకోవడానికి అవకాశం కల్పించాలని రాష్ట్రాలను ఆదేశించనుంది. ఈ విషయాన్ని బైడెన్‌ తన తొలి ప్రైమ్‌టైమ్‌ ప్రసంగంలో వెల్లడించారు. ప్రస్తుతం ప్రజల వయస్సు దృష్టిలో ఉంచుకొని టీకాలు అందజేయడంలో ప్రాధాన్యమిస్తున్నారు. కరోనాని మహమ్మారిగా ప్రకటించి ఏడాది అయిన సందర్భంగా బైడెన్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ‘‘జులై4 వ తేదీ నాటికి మనం సమష్టిగా టీకాలు వేయించుకుంటే.. తిరిగి బంధుమిత్రుల సమేతంగా గార్డెన్లలో పార్టీలు చేసుకుంటూ ఇండిపెండెంట్స్‌ డేను జరుపుకోవచ్చు.  వైరస్‌ నుంచి స్వాతంత్ర్యం పొందవచ్చు. వైరస్‌ను ఓడించి సాధారణ జీవితం పొందడానికి జాతి ఐకమత్యం అత్యంత కీలకమైంది’’ అని తెలిపారు.

బైడెన్‌ సర్కారు టీకాలు వేసే కేంద్రాలను కూడా పెంచాలని భావిస్తోంది. ఇందు కోసం పశువైద్యులు, దంత వైద్యులు కూడా టీకాలు వేసేందుకు అనుమతులు మంజూరు చేయనుంది. మొబైల్‌ యూనిట్లను ఏర్పాటు చేసి వెనుకబడిన ప్రాంతాలకు కూడా సరఫరా చేయనున్నట్లు బైడెన్‌ వెల్లడించారు. 100 రోజుల్లో 100 మిలియన్ల డోసులు ప్రజలకు ఇవ్వాలని తాను పెట్టుకొన్న లక్ష్యాన్ని కేవలం 60 రోజుల్లోనే పూర్తిచేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వైరస్‌తో చేస్తున్న యుద్ధం ముగియడానికి సుదీర్ఘ సమయం పట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

కరోనా కష్టాల నుంచి అమెరికా ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు బైడెన్‌ సర్కారు ప్రతిపాదించిన 1.9 ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి చట్టసభల్లో ఆమోదముద్ర లభించింది. ఈ ప్యాకేజీలో ఉపాధి కోల్పోయిన వారికి 1400 డాలర్లు ఇవ్వడంతోపాటు ఛైల్డ్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను వర్తింపజేయనున్నారు. రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు 350 బిలియన్‌ డాలర్లు, పాఠశాలల పునఃప్రారంభానికి 130 బిలియన్‌ డాలర్లు, కొవిడ్‌ పరీక్షా కేంద్రాల పెంపునకు 49 బిలియన్‌ డాలర్లు, టీకాల పంపిణీకి 14 బిలియన్‌ డాలర్లు కేటాయించనున్నారు.

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని