Indian American: పెంటగాన్‌లో కీలక పదవికి భారత సంతతి వ్యక్తి!

ఇప్పటికే అమెరికా ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఆసీనులైన భారత సంతతి వ్యక్తుల జాబితాలో మరొకరు చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి....

Published : 15 Oct 2021 11:08 IST

ప్రతిపాదించిన అధ్యక్షుడు బైడెన్‌

వాషింగ్టన్‌: ఇప్పటికే అమెరికా ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఆసీనులైన భారత సంతతి వ్యక్తుల జాబితాలో మరొకరు చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయమైన పెంటగాన్‌లో ఓ కీలక పదవికి అధ్యక్షుడు జో బైడెన్‌ భారత సంతతి వ్యక్తి పేరును ప్రతిపాదించారు. గతంలో అమెరికా వాయుసేనలో పనిచేసిన రవి చౌదరి అనే వ్యక్తి పెంటగాన్‌లోని ‘ఎయిర్‌ఫోర్స్‌ ఫర్‌ ఇన్‌స్టల్లేషన్స్‌ అండ్‌ ది ఎన్విరాన్‌మెంట్‌’ విభాగానికి అసిస్టెంట్‌ సెక్రటరీ హోదాకు అర్హుడని బైడెన్‌ తెలిపారు. బైడెన్‌ ప్రతిపాదనకు సెనేట్‌ ఆమోదం లభిస్తే.. రవి చౌదరి ఆ పదవి చేపట్టనున్నారు. 

రవి చౌదరి గతంలో ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌ఏఏ)లో అడ్వాన్స్‌డ్‌ ప్రోగ్రామ్స్‌ ఇన్నోవేషన్‌ విభాగానికి డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ హోదాలో ఎఫ్‌ఏఏ వాణిజ్య అంతరిక్ష ప్రయాణాలపై జరుగుతున్న పరిశోధనలకు నేతృత్వం వహించారు. 1993-2015 వరకు వాయుసేనలో వివిధ హోదాల్లో పనిచేశారు. సీ-17 యుద్ధ విమాన పైలట్‌ అయిన రవి.. అఫ్గానిస్థాన్‌, ఇరాక్‌లో కీలక ఆపరేషన్లలో పాల్గొన్నారు. వ్యోమగాముల భద్రత కోసం నాసాతోనూ కలిసి పనిచేశారు. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు ఒబామా హయాంలో ఏషియన్‌ అమెరికన్స్‌ అండ్‌ పసిఫిక్‌ ఐలాండర్స్‌ కమిషన్‌కు సలహాదారుగా పనిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని