స్ఫూర్తిమంతంగా సింగపూర్ తెలుగు సమాజం రక్తదాన కార్యక్రమం
సింగపూర్ తెలుగు సమాజం, రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో ఆగస్టు 13న రక్తదాన శిబిరాలను నిర్వహించారు.
ఇంటర్నెట్ డెస్క్: సింగపూర్ తెలుగు సమాజం, రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో ఆగస్టు 13న సింగపూర్‌లో రక్తదాన శిబిరాలను నిర్వహించారు. సింగపూర్ జాతీయ దినోత్సవం (ఆగస్టు 9), భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని (ఆగస్టు 15) పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హెచ్‌ఎస్‌ఏ ఔట్రం రోడ్డు, వన్ పుంగోల్‌లో ఏకకాలంలో వీటిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగపూర్‌లోని తెలుగు వారి నుంచి అద్భుతమైన స్పందన లభించింది. హెచ్‌ఎస్‌ఏ ఔట్రం రోడ్డులోని శిబిరంలో 50 మంది, వన్ పంగోల్‌లోని శిబిరంలో 25 మంది దాతలు రక్తదానం చేశారు. ప్రత్యేకంగా కుంకు వరలక్ష్మి - నాగేశ్వరరావు దంపతులు రక్తదానం చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి దాతలను అభినందించారు. రక్తదానం గురించి అందరూ అవగాహన పెంచుకోవాలని కోరారు. అందరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తం కోసం సోషల్ మీడియాలో వచ్చే అభ్యర్థనలను షేర్ చేసి తమ వంతు సాయం అందించాలని కోరారు. సింగపూర్ తెలుగు సమాజం ఇలాంటి రక్తదాన శిబిరాలను అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తోందన్నారు.
ప్రత్యేకించి కొవిడ్-19 మహమ్మారి సమయంలో 9 సార్లు రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు సింగపూర్ తెలుగు సమాజం ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ గుర్తు చేశారు. హెచ్‌ఎస్‌ఏ ఔట్రం రోడ్డులోని శిబిరానికి వైదా మహేష్, రాపేటి జనార్దన రావు, బోయిని సమ్మయ్య, గాడిపల్లి చంద్రమౌళి, బద్దం జితేందర్ సమన్వయకర్తలుగా పనిచేశారు. వన్ పుంగోల్‌లో శిబిరానికి జ్యోతీశ్వర్ రెడ్డి, పాలేపు మల్లిక్, పుల్లన్నగారి శ్రీనివాస్ రెడ్డి, బచ్చు ప్రసాద్, టేకూరి నగేష్, కొత్త సుప్రియ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. పెద్ది శేఖర్ రెడ్డి, బైరి రవి బృందం చాలా ఉత్సాహంగా తోటి కార్మికులతో కలిసి రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. దాతలు, పరిశీలకులు, సేవాదళం సభ్యులకు కార్యక్రమ నిర్వాహకులు జూనెబోయిన అర్జున్ రావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అందరి సమష్టి కృషితోనే కార్యక్రమం విజయవంతమైనదన్నారు. తదుపరి రక్తదాన కార్యక్రమం 29 అక్టోబర్ 2023న నిర్వహించబోతున్నామన్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TS TET Results: టెట్ ఫలితాలు నేడే.. రిజల్ట్స్ ఈనాడు.నెట్‌లో..
-
హైదరాబాద్‌లో లులు మాల్
-
‘నా పెద్ద కొడుకు’ అరెస్టుతో ఆకలి, నిద్ర ఉండడం లేదు
-
Leander Paes: టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు అరుదైన గుర్తింపు
-
Babar Azam: టాప్-4 చిన్న విషయం.. ప్రపంచకప్ గెలవడమే మా లక్ష్యం : బాబర్ అజామ్
-
Guntur Kaaram: రాజమౌళి చిత్రాల స్థాయిలో ‘గుంటూరు కారం’.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా: నిర్మాత నాగవంశీ