ఐర్లాండ్‌లో ఘనంగా ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు శతజయంతి, మహానాడు వేడుకలను ఐర్లాండ్‌లో తెదేపా ఐర్లాండ్‌ విభాగం ఘనంగా నిర్వహించింది.

Published : 29 May 2023 00:20 IST

ఐర్లాండ్‌: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు శతజయంతి, మహానాడు వేడుకలను తెదేపా ఐర్లాండ్‌ విభాగం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలకు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు వీడియో కాన్పరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ జీవిత విశేషాలను పంచుకున్నారు. చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారులను ఆకర్షించి సైబరాబాద్‌ను నెలకొల్పిన విధానాన్ని గురించి వివరించారు. గత 7-8 ఏళ్లుగా ఏ రాజకీయ నాయకుడు ఎదుర్కొని నీలాపనిందలను లోకేశ్‌ ఎదుర్కొన్నారన్నారు. ‘యువగళం’ పాదయాత్రతో లోకేశ్‌ విమర్శకుల నోళ్లు మూయించారన్నారు. 

తెదేపా ఐర్లాండ్ రీజనల్ కోఆర్డినేటర్ కిశోర్ బాబు, ప్రెసిడెంట్ భరత్ భాష్యం, కార్క్ తెదేపా ఐర్లాండ్ గౌరవ సభ్యులు గోగినేని, సాయి పవన్ రాజేష్ వల్లూరి, హరి కృష్ణ వడ్లమూడి, భరత్ నుతకి, చంద్రశేఖర్ తాడిగురుపూర్ణ, సంతోష్ శర్మ, విజయ్ కృష్ణ చందోలు, నాగరాజు జడ, మురళీకృష్ణ, నరేంద్ర ముప్పాళ్ల కమిటీ సభ్యులు సమక్షంలో నాలుగు తీర్మానాలు చేశారు. కృష్ణ ప్రసాద్ కాట్రగడ్డ కార్యక్రమ ఏర్పాట్లు పర్యవేక్షించారు.

ఆమోదించిన తీర్మానాలు..

1. తెదేపా ఐర్లాండ్, తెదేపా యూరప్‌లో ఉన్న 10 తెదేపా అనుబంధ విభాగాలతో కలిసి ముందుకు నడవటం. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం అవడం. 5 నియోజకవర్గాలకు క్షేత్ర స్థాయిలో మద్దతు తెలియజేయడం. మిగిలిన అన్ని నియోజకవర్గాలకు సోషల్ మీడియా ద్వారా మద్దతు తెలపాలి.

2. సోషల్ మీడియాలో తెదేపాను బలోపేతం చేయడంతో పాటు మరింత ఉద్ధృతంగా ప్రచారం చేయాలి.

3. తిత్లీ, హుద్‌హుద్‌ తుపాను, ఉక్రెయిన్ సంక్షోభం సమయాల్లో మేము సైతం అంటూ అందించిన సహాయ సహకారాలను ఇకముందు కూడా కొనసాగించాలని నిర్ణయించారు. 

4. ఐర్లాండ్‌కు కొత్తగా వచ్చిన తెలుగు విద్యార్థులు, తెలుగు ప్రజలకి తమ వంతు సహాయ సహకారాలు అందించాలి. ఉద్యోగ సందేహాలు తీర్చడం, నియామకాలకు సంబంధించి మార్గదర్శకత్వం చేయడం, వీసా సందేహాలు ఇలా ఎన్నో కార్యక్రమాలను ఇక ముందు కుడా కొనసాగించాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు