షార్లెట్‌లో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను అమెరికాలోని అన్ని పెద్ద నగరాలలో ఎన్నారై తెదేపా కార్యకర్తలు భారీ ఎత్తున నిర్వహించారు.

Published : 21 Apr 2022 00:02 IST

అమెరికా: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను అమెరికాలోని అన్ని పెద్ద నగరాలలో ఎన్నారై తెదేపా కార్యకర్తలు భారీ ఎత్తున నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు, చంద్రబాబు అభిమానులు సమన్వయపరుచుకొని  ఈ వేడుకలను జరిపారు. నార్త్ కెరొలినా రాష్ట్రంలోని షార్లెట్ నగరంలో చంద్రబాబు 72వ పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. వేడుకల కోసం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పురుషోత్తం చౌదరి గుడే, ఠాగూర్ మల్లినేని ఆధ్వర్యంలో తెదేపా అభిమానులు సమావేశమై ఈవేడుకలను ఘనంగా జరిపారు. 

‘‘హ్యాపీ బర్త్ డే నారా చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు, జై జై తెలుగుదేశం’’ అంటూ అభిమానుల నినాదాల నడుమ కేక్ కోసి వేడుక చేశారు. ఈ సందర్భంగా పురుషోత్తం చౌదరి గుడే మాట్లాడుతూ.. 72 ఏళ్ల వయసులో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పడే తపన, కష్టం మనందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు. మళ్లీ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబును ఎన్నుకొని అసలైన పుట్టినరోజు బహుమతి ఇవ్వాలన్నారు. 

దేవరాజు మాట్లాడుతూ.. నారా చంద్రబాబుని మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేస్తే మనకు, మన తర్వాత తరాలవారికి మంచి భవిష్యత్తును ఇస్తారని అన్నారు. మనం కూడా అలసత్వం వదిలి మేధోమథనం చేసి తెలుగుదేశం పార్టీకి మన మన గ్రామాల్లో ఎలా సహాయం చేయగలమో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న అందరికీ ఠాగూర్ మల్లినేని కృతజ్ఞతలు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని