కువైట్‌లో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

ఎన్నారై తెదేపా-కువైట్‌ శాఖ ఆధ్వర్యంలో తెదేపా అధినేత చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇఫ్తార్‌ విందు ......

Published : 23 Apr 2022 16:59 IST

కువైట్‌: ఎన్నారై తెదేపా-కువైట్‌ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ విందు, తెదేపా అధినేత చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేకు కట్‌ చేసి నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై తెదేపా సెల్‌ సీనియర్‌ నేత వెంకట్‌ కోడూరి మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి పథంలో నడిపించి భావితరాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో సంపద సృష్టి జరిగి మళ్లీ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షించారు. ఆయన్ను నవ్యాంధ్ర దార్శనికుడు, అమరావతి సృష్టికర్త అని కొనియాడారు.

ఎన్నారై తెదేపా సెల్‌ సీనియర్‌ నేత సురేష్‌ బాబు నాయుడు మాలెపాటి మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ.. ఆ ఇబ్బందులు తొలగి ప్రజలు సౌకర్యవంతమైన జీవనం కొనసాగించాలంటే రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేసి చంద్రబాబు నాయుడుని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోకపోతే ఏపీ అంధకారమవుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్రం దివాలా తీసి ప్రజలపై అనేక రకాల పన్ను భారాలు మోపుతున్నారని  ఉదయ్‌ ప్రకాశ్‌ అన్నారు. అప్పులు చేసి రాష్ట్రాన్ని పాలిస్తున్నారే తప్ప ఎక్కడా ఒక్క రూపాయి సంపద సృష్టి జరగడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. జగన్‌ పాలనకు చరమగీతం పాడాలంటే అంతా కలిసి పార్టీ కోసం శ్రమించి చంద్రబాబును తిరిగి సీఎం చేయలేకపోతే ఏపీ మరో శ్రీలంక అవుతుందని వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై తెదేపా గల్ఫ్ నేత గుదె శంకర్‌ చౌదరి, ఎన్నారై తెదేపా మైనార్టీ విభాగం అధ్యక్షుడు రహ్మతుల్లా సూచన మేరకు కార్యవర్గం, ఎన్టీఆర్‌ సేవా సమితి అధ్యక్షుడు చుండు బాలరెడ్డయ్య, ఎన్టీఆర్‌ పరిటాల ట్రస్టు అధ్యక్షుడు జి. నరసింహలులు, చంద్రన్న సేవా సమితి అధ్యక్షుడు షేక్ సుబహాన్ తెదేపా కువైట్ అధ్యక్షులు నాయనిపాటి విజయ్‌కుమార్‌ చౌదరి, సీనియర్‌ నాయకులు వెంకటేశ్‌ నాయుడు వేగి సహా భారీ సంఖ్యలో తెదేపా శ్రేణులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎన్నారై తెదేపా సెల్‌ కువైట్‌ కౌన్సిల్‌ సభ్యులు ఓలేటి రెడ్డయ్య చౌదరి, షేక్‌ మహ్మద్‌ అర్షద్‌ సమన్వయం చేయగా.. దీనికి పరోక్ష సహకారం అందించిన ఎన్నారై తెదేపా గల్ఫ్‌ అధ్యక్షుడు గుదె నాగార్జునకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని