ఐర్లాండ్‌ తెదేపా ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు

తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఐర్లాండ్‌లో ఘనంగా నిర్వహించారు. రాజధాని డబ్లిన్‌లో ఐర్లాండ్‌ ఎన్‌ఆర్‌ఐ తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.

Published : 24 Apr 2023 12:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఐర్లాండ్‌లో ఘనంగా నిర్వహించారు. రాజధాని డబ్లిన్‌లో ఐర్లాండ్‌ ఎన్‌ఆర్‌ఐ తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఐర్లాండ్‌ తెలుగు మహిళ అధ్యక్షురాలు సీత కేక్‌ కట్ చేసి పార్టీ సభ్యులకు పంచారు.

అనంతరం నేతలు మాట్లాడుతూ చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరాన్ని, ఆవశ్యకతను వివరించారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు. సైకో పాలనకు స్వస్తి పలికి సైకిల్‌ పాలనకు నాంది పలకాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో ప్రెసిడెంట్‌ భాష్యం భరత్‌, రీజినల్‌ కోఆర్డినేటర్‌ డా.కిశోర్‌బాబు చలసాని, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు రంగ ఎల్లా, యశ్వంత్‌ మడకశిర, కాట్రగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్‌, నరేంద్ర, శివబాబు, రామకృష్ణ, విజయ్‌ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని