Published : 21/04/2021 17:57 IST

కువైట్‌ తెదేపా ఆధ్వర్యంలో చంద్రబాబు బర్త్‌డే వేడుకలు 

కువైట్‌: తెదేపా జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను తెలుగుదేశం కువైట్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో జూమ్‌ వేదికగా నిర్వహించిన ఈ వేడుకల్లో కేకు కట్‌ చేసి అందరూ చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఏకధాటిన 4 గంటలకు పైగా ఎంతో ఉత్సాహంగా కొనసాగిన ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య అతిథులు, పలు దేశాల్లోని నేతలంతా మాట్లాడి చంద్రబాబు మరోసారి సీఎం కావాలని, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ఆకాంక్షించారు. భావితరాలకు పునాదులను మరింత పటిష్టం చేయాలని కోరారు. అలాగే, అమరావతి లాంటి ప్రపంచ స్థాయి రాజధాని నగర నిర్మాణం, పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్టు పూర్తి కావాలన్నా మళ్లీ చంద్రబాబు సీఎం అవ్వాలని మనసారా కోరుకుంటున్నామన్నారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో చిరకాలం జీవించాలని ప్రార్థించారు. 

ఈ కార్యక్రమంలో ప్రముఖ నాటక రంగ ప్రముఖులు గుమ్మడి గోపాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నాదెండ్ల బ్రహ్మం చౌదరి, కదిరి తెదేపా నేత బండారు మనోహర్ నాయుడు,  మచిలీపట్నం పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు  స్వర్ణలత గారు, ప్రముఖ కవి అయినాల మల్లేశ్వర రావు,  ప్రముఖ గాయకుడు ప్రవీణ్ కుమార్‌తో పాటు భారత్‌, అమెరికా, లండన్‌, సౌదీ అరేబియా, ఖతార్‌, బెహ్రెయిన్‌, దుబాయి, ఒమన్‌, థాయ్‌లాండ్‌ దేశాల్లోని పార్టీ ప్రతినిధులు, చంద్రబాబు అభిమానులు పాల్గొన్నారు.

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని