అమెరికాలోని 50 నగరాల్లో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

తెదేపా అధినేత చంద్రబాబు 72వ జన్మదిన వేడుకలను అమెరికాలోని 50 నగరాల్లో ఘనంగా నిర్వహించారు.

Published : 20 Apr 2022 13:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెదేపా అధినేత చంద్రబాబు 72వ జన్మదిన వేడుకలను అమెరికాలోని 50 నగరాల్లో ఘనంగా నిర్వహించారు. ‘ఎన్‌ఆర్‌ఐ తెదేపా-యూఎస్‌ఏ’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో ఎన్‌ఆర్‌ఐ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. 

అనంతరం మాట్లాడుతూ తెలుగు గడ్డపై ఎంతో ముందుచూపుతో హైటెక్‌ సిటీ రూపంలో చంద్రబాబు వేసిన అభివృద్ధి బీజాలే నేడు అమెరికాలోని ఐటీ రంగంలో మహావృక్షాలుగా మారాయన్నారు. తెలుగువారి శక్తి సామర్థ్యాలకు తిరుగులేదని ప్రపంచానికి చాటిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. ఏడుపదుల వయసులోనూ ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ఆయన తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారని నేతలు పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని