దుబాయిలో ఘనంగా తెలుగు ప్రవాసీయుల క్రిస్మస్ సంబరాలు

యూఏఈలోని దుబాయిలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ఐక్య  క్రైస్తవ సంఘాల కలయికతో బ్రదర్ సామ్యూల్‌ రత్నం నీలా ఆధ్వర్యంలో డైరా క్రీక్‌ దౌ క్రూజ్‌లో ఈ సంబరాలు చేసుకున్నారు.

Published : 21 Dec 2022 15:53 IST

దుబాయి: యూఏఈలోని దుబాయిలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్తవ సంఘాల కలయికతో బ్రదర్ సామ్యూల్‌ రత్నం నీలా ఆధ్వర్యంలో డైరా క్రీక్‌ దౌ క్రూజ్‌లో ఈ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా 200లకు పైగా క్రైస్తవ కుటుంబాలు తమ పిల్లలతో కలిసి ఈ వేడుకల్లో  పాల్గొని సందడి చేశాయి. ఇందులో భాగంగా క్వైర్ మ్యూజిక్ సిస్టమ్‌తో కలిపి అంతా ప్రార్థనలు చేస్తూ పాటలతో అలరించారు. బ్రదర్ అరవింద్ బృందం వారు క్రిస్మస్‌ కలర్స్‌తో చేసిన గాత్ర కచేరి అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో దుబాయిలోని వివిధ సంఘాలకు చెందిన పాస్టర్లు, సంఘ పెద్దలతో పాటు సామాజిక కార్యకర్తలు సిస్టర్ ఎస్తర్‌, పాస్టర్ ఫ్రాన్సిస్, డాక్టర్ ముక్కు తులసీ కుమార్, రావి కిరణ్ కోడి, కంబాల మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని