దుబాయిలో ఘనంగా బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు

తెలుగు సినీ అగ్ర కథానాయకుడు, హిందూపూర్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు దుబాయిలో.....

Published : 11 Jun 2022 20:16 IST

దుబాయి: తెలుగు సినీ అగ్ర కథానాయకుడు, హిందూపూర్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు దుబాయిలో ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి పీతల సుజాత, తెదేపా రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బ్రహ్మం నాదెండ్లతో పాటు పలువురు తెదేపా కార్యకర్తలు, బాలయ్య అభిమానులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా  పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకు కట్‌ చేసి తమ అభిమాన హీరో పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్నారు.

మరోవైపు, తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు దుబాయిలో నిర్వహించారు. ఫ్లోరా ఇన్‌ హోటల్‌లో జరిగిన ఈ వేడుకలకు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి పీతల సుజాతతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు తదితరులు హాజరయ్యారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు