అమెరికాలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు ఘన స్వాగతం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ ఉదయం న్యూయర్క్‌ విమానాశ్రయంలో.......

Published : 23 Jun 2022 20:10 IST

న్యూయార్క్‌: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ ఉదయం న్యూయర్క్‌ విమానాశ్రయంలో దిగిన ఆయనకు ఘనస్వాగతం లభించింది. భారత్‌ బయోటెక్ అధినేత కృష్ణ ఎల్లా, ఎండీ సుచిత్రా ఎల్లా, భారత కాన్సులేట్ జనరల్ రణ్‌ధీర్ జైశ్వాల్, తానా పూర్వ అధ్యక్షుడు జయ్ తాళ్లూరి, తానా ప్రముఖులు వలివేటి బ్రహ్మాజీ, వాసిరెడ్డి వంశీ, అరవింద్ తదితరులు ఆయనకు ఆహ్వానం పలికారు. ఈ నెల 24న న్యూజెర్సీలో జరిగే తెలుగు కమ్యూనిటీ ఆఫ్‌ నార్త్‌ అమెరికా, 25న వర్జీనియాలో తెలుగు కమ్యూనిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ డీసీ ఆధ్వర్యంలో జరిగే మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమాల్లో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పాల్గొంటారు. జులై 1న సీజేఐ గౌరవార్థం మిల్పిటాస్‌లో అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండో అమెరికన్స్‌ ఏర్పాటుచేసిన సభలో పాల్గొని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని