నిధుల సేకరణకు ఫాల్సామ్‌ క్రికెట్‌ క్లబ్‌ వార్షిక క్రికెట్‌ పోటీలు

శంకర ఐ ఫౌండేషన్, సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌ల నిధుల సేకరణ కోసం ఫాల్సామ్ క్రికెట్ క్లబ్ వార్షిక క్రికెట్ పోటీలను నిర్వహించింది.

Published : 19 Aug 2023 17:02 IST

అమెరికా: శంకర ఐ ఫౌండేషన్, సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌ల నిధుల సేకరణ కోసం ఫాల్సామ్ క్రికెట్ క్లబ్ వార్షిక క్రికెట్ పోటీలను నిర్వహించింది. ఈ పోటీల్లో మొత్తం 22 జట్లు పాల్గొనగా..  ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వెయ్యి మందికి పైగా ఎన్నారైలు హాజరయ్యారు. 40మంది ఇంటెల్ కంపెనీ ఉద్యోగులు ఈ పోటీలకు వాలంటీర్లుగా తమ సేవలను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుధీర్ చెముడుగుంట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి తర్వాత  ఇలా అందరూ కలిసి ఒక మంచి పనికోసం క్రికెట్‌ను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.  కరోనా కారణంగా గత మూడేళ్ళుగా ఫండ్ రైజింగ్‌ కార్యక్రమాలు నిర్వహించకపోయినా దాతల సాయంతో హైదరాబాద్‌, ముంబయి ఐ హాస్పిటల్స్‌ పూర్తి చేసి తమ సేవలను తెలంగాణ, మహారాష్ట్రలోని గ్రామీన ప్రాంతాలకు చెందిన పేదలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. 

మరోవైపు,  శంకర ఐ ఫౌండేషన్ ఇప్పటివరకు 12 కంటి ఆస్పత్రులు నిర్మించి దాదాపు 24 లక్షల మందికి పైగా ఉచిత కంటి ఆపరేషన్‌ నిర్వహించి వారందరికీ కంటిచూపును ప్రసాదించిందని కొనియాడారు.  2030 నాటికి ఏటా  10 లక్షల మందికి ఉచితంగా కంటి ఆపరేషన్స్ చేయడమే తమ లక్ష్యమన్నారు. దీనికోసం కొత్త ఆస్పత్రులను నిర్మించడంతో పాటు ఉన్న ఆస్పత్రుల సామర్థ్యాన్ని పెంచుతున్నామన్నారు. ఇందులో భాగంగా గుంటూరు, లఖ్‌నవూలలో ఆస్పత్రులను విస్తరిస్తున్నట్టు చెప్పారు.  అనంతరం భాస్కర్ వెంపటి మాట్లాడుతూ..  సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను వివరించారు.  తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలలో విద్యార్థులకు చేయూత అందిచడంతోపాటు, వాటర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నట్టు తెలిపారు 

ఈ కార్యక్రమ నిర్వాహకులు రమేశ్‌ చెళ్లపిళ్ల, శ్రీని సంగాని మాట్లాడుతూ ఏటా శంకర ఐ ఫౌండేషన్‌ కోసం ఈ కార్యక్రమం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వాలంటీర్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.   అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని  రమేష్ చెళ్ళపిళ్ళ, శ్రీని సంగాని, రామ కోమటి, మయూరేష్, ప్రశాంత్, పవన్ పున్నమరాజు, వెంకట్ రాజ, మత్తయ్య, పొట్లూరి తదితరులు విజయవంతంగా నిర్వహించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు