US: సిక్కు వ్యక్తిపై దాడి తీవ్రంగా కలచివేసింది: అమెరికా
గత వారం అమెరికాలో సిక్కు వర్గానికి చెందిన భారత సంతతి ట్యాక్సీ డ్రైవర్‌పై జరిగిన దాడిని అమెరికా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది....
భిన్నత్వమే తమ బలమని ఉద్ఘాటన
న్యూయార్క్ : గత వారం అమెరికాలో సిక్కు వర్గానికి చెందిన భారత సంతతి ట్యాక్సీ డ్రైవర్‌పై జరిగిన దాడిని అమెరికా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. జేఎఫ్‌కే అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జరిగిన ఈ దాడి తమని ‘తీవ్రంగా కలచివేసింది’ అని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. భిన్నత్వమే అమెరికాను మరింత బలంగా మారుస్తోందని స్పష్టం చేసింది. ద్వేషపూరిత దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ శాఖలోని ‘బ్యూరో ఆఫ్ సౌత్ సెంట్రల్ ఏషియన్ అఫైర్స్ విభాగం’ ట్వీట్ చేసింది.
జేఎఫ్‌కే విమానాశ్రయం ఆవరణలో సిక్కు ట్యాక్సీ డ్రైవర్‌పై ఓ వ్యక్తి దాడి చేస్తున్నట్లు ఉన్న ఓ వీడియోను జనవరి 4న నవజ్యోత్పాల్ కౌర్ అనే వ్యక్తి ట్విటర్లో పోస్ట్ చేశారు. అది ఎప్పుడు జరిగిందో తెలియదని పేర్కొన్నారు. అయితే, ఈ వీడియోను ఈ ఘటన జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న ఓ వ్యక్తి తీశారని తెలిపారు. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ బాధితుడిపై సదరు వ్యక్తి పిడి గుద్దులు కురిపించడం వీడియోలో కనిపించింది. అమెరికాలో ఇంకా ద్వేషపూరిత దాడులు జరుగుతున్నాయనడానికి ఇది నిదర్శనమని కౌర్ ఆరోపించారు. పైగా సిక్కు క్యాబ్ డ్రైవర్లపై ఇది పదే పదే కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఈ ఘటనను న్యూయార్క్‌లోని భారత దౌత్యకార్యాలయం తీవ్రంగా పరిగణించింది. విషయాన్ని అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆ దేశ విదేశాంగ శాఖ దర్యాప్తు జరిపి నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Israel: హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో టాప్ కమాండర్ హతం
హమాస్ లక్ష్యంగా భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ కీలక పురోగతి సాధించింది. హమాస్ నంబర్ 3 కమాండర్ మార్వాన్ ఇస్సా హతమైనట్లు అమెరికా ప్రకటించింది. -
పుతిన్ కొత్త రికార్డు!
రష్యా అంటే వ్లాదిమిర్ పుతిన్. పుతిన్ అంటే రష్యా.. ఇది మరోసారి రుజువైంది. విమర్శలు ఎన్నిఉన్నా.. అనుకున్నది సాధించి చూపడంలో తనదైన శైలిని సొంతం చేసుకున్న నేత వరసగా అయిదోసారి అధ్యక్షునిగా.. రికార్డుస్థాయిలో 87.29% ఓట్లతో నెగ్గారు. -
ఢీ అంటే ఢీ అంటున్న పాక్, అఫ్గాన్
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ల మధ్య ఘర్షణ వాతావరణం ముదురుతోంది. ఈ నెల 16న పాక్‌లో మీర్ అలీ లోని పాక్ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి అయిదుగురు సైనికులు, ఇద్దరు అధికారులను హతమార్చారు. -
గూఢచారి నుంచి అధ్యక్షుడి వరకు..
ప్రధానిగా, అధ్యక్షుడిగా కలిపి గత 24 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతోన్న వ్లాదిమిర్ పుతిన్ రష్యాను సుదీర్ఘకాలం పాలించిన నేతగా రికార్డు సృష్టించనున్నారు. అధ్యక్షుడిగా తాజా ఎన్నికతో లభించిన ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటే ఆయన ఈ ఘనత సాధించనున్నారు. -
ఏడువేల కంటైనర్లలో.. రష్యాకు ఉత్తరకొరియా యుద్ధసామగ్రి
ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్దతుగా రష్యాకు గతేడాది నుంచి ఉత్తరకొరియా దాదాపు 7 వేల కంటైనర్ల యుద్ధ సామగ్రిని సరఫరా చేసిందని దక్షిణకొరియా రక్షణ శాఖ మంత్రి షిన్ వాన్ సిక్ వెల్లడించారు. -
నైజీరియాలో 100 మంది గ్రామస్థుల కిడ్నాప్
నైజీరియాలో సాయుధ ముఠాలు మళ్లీ చెలరేగిపోయాయి. వాయువ్య సరిహద్దులోని కదునా రాష్ట్రం కజూరూ కౌన్సిల్‌లోని గ్రామాలపై దాడులుచేసి 100 మంది గ్రామస్థుల్ని అపహరించుకుపోయారు. -
ఆసుపత్రిపై ‘ఆపరేషన్’!.. గాజాలో మరో 81 మంది మృతి
గాజాలోని అతి పెద్ద ఆసుపత్రి అల్ షిఫాను సోమవారం ఉదయం ఇజ్రాయెల్ బలగాలు చుట్టుముట్టాయి. వేల మంది ఆశ్రయం పొందుతున్న ఈ ఆసుపత్రిలోని అణువణువునూ శోధిస్తున్నాయి. -
రష్యా నుంచి విడిపించాలని వీడియోలో భారతీయుల వినతి
అనూహ్య పరిస్థితుల్లో రష్యా సైన్యంలో చిక్కుకుపోయిన భారతీయులు తమను కాపాడాలంటూ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. -
ఎబోలా కట్టడికి కొత్త ఔషధాలు!
మానవ శరీరంలో ఎబోలా వైరస్ పునరుత్పత్తి చెందే తీరును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వ్యాధి నివారణకు కొత్త ఔషధాల రూపకల్పనకు ఇది దోహదపడుతుందని వారు వివరించారు. -
క్షామం అంచున గాజా
ఇజ్రాయెల్ దాడులతో గాజా పరిస్థితి దారుణంగా మారింది. స్థానికుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఉత్తర గాజా క్షామం అంచుకు చేరుకుందని ఐరాస ఆహార సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
నెల తర్వాత మాట్లాడుకున్న బైడెన్, నెతన్యాహు
కాల్పుల విరమణ, గాజాలో మానవతా సాయం విషయంలో మనస్పర్థలకారణంగా గత కొంతకాలంగా ఎడముఖం పెడముఖంగా ఉంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నెల తర్వాత మళ్లీ మాట్లాడుకున్నారు. -
Munitions: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. ఏడు వేల కంటెయినర్ల ఆయుధాలు!
రష్యాకు ఉత్తర కొరియా గతేడాది నుంచి దాదాపు ఏడు వేల కంటెయినర్ల ఆయుధ సామగ్రి, ఇతర సైనిక పరికరాలను చేరవేసినట్లు దక్షిణ కొరియా ఆరోపించింది.
తాజా వార్తలు (Latest News)
-
PSL: మ్యాచ్ జరుగుతుండగా డ్రెస్సింగ్ రూమ్‌లో సిగరెట్ తాగిన క్రికెటర్
-
Supreme Court: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో.. రామ్‌దేవ్‌బాబాకు సుప్రీంకోర్టు సమన్లు
-
SS Rajamouli: త్వరలో షూటింగ్.. మహేశ్ మూవీపై జక్కన్న అప్డేట్
-
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత
-
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలికలు ఇవే: ధ్రువ్ జురెల్
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్‌కు అదనపు బాధ్యతలు