టాంపా బే లో వేడుకగా జెండా ఆవిష్కరణ

అజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ సంబరాలను అమెరికాలోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) టాంపా బే విభాగం, ఎఫ్‌ఐఏ సంయుక్తంగా జాతీయ జెండా ఆవిష్కరణ..

Published : 19 Aug 2022 01:04 IST

అమెరికా:  ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలను అమెరికాలోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) టాంపా బే విభాగం, ఎఫ్‌ఐఏ సంయుక్తంగా జాతీయ జెండా ఆవిష్కరణ, జాతీయ గీతాలాపన కార్యక్రమాలను ఘనంగా చేపట్టారు. అనంతరం అమెరికా జాతీయ గీతాన్ని కూడా ఆలపించి ఇరు దేశాలపై తమకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో టాంపా బే నాట్స్ విభాగం నాయకులు భాను ప్రకాశ్ ధూళిపాళ్ల, రాజేశ్ కాండ్రు, సుధీర్ మిక్కిలినేని, సురేశ్ బొజ్జ, బిందు సుధ, సుధాకర్ మున్నంగి, సుమంత్ రామినేని, ఎఫ్.ఐ.ఏ ప్రెసిడెంట్ జిగిషా దేశాయ్‌తోపాటు ఆమె కార్యనిర్వాహక బృందం, డాక్టర్ శేఖరం, మాధవి కొత్త, నాట్స్ ఛైర్‌పర్సన్‌ అరుణ గంటి, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య (బాపు) చౌదరి, నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు సభ్యులు శేఖరం కొత్త, నాట్స్ బోర్డు వైస్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, శ్రీనివాస్ మల్లాది, రాజేశ్ నెట్టెం, భాను ప్రకాశ్ ధూళిపాళ్ల,  వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్), ప్రొగ్రామ్స్ నేషనల్ కో ఆర్డినేటర్ రాజేశ్ కాండ్రు, జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, టెంపాబే విభాగ సమన్వయకర్త ప్రసాద్ ఆరికట్ల, జాయింట్ కో ఆర్డినేటర్ సురేశ్ బొజ్జ, సెక్రటరీ రంజిత్ చాగంటి, సోషల్ మీడియా నేషనల్ కో ఆర్డినేటర్ వెంకట్ మంత్రి, మార్కెటింగ్ నేషనల్ కోఆర్డినేటర్ కృష్ణ నిమ్మగడ్డ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని