బసవతారకం ఆసుపత్రికి వీల్ చైర్ల వితరణ

 హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బసవతారకం ఇండో అమెరికన్  క్యాన్సర్ ఆసుపత్రిలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా

Published : 17 Aug 2022 01:48 IST

30 వీల్‌చైర్లను అందించిన ఎన్నారై  పొట్లూరి రవి 

హైదరాబాద్‌ :  హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బసవతారకం ఇండో అమెరికన్  క్యాన్సర్ ఆసుపత్రిలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్నారై  పొట్లూరి రవి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి 30 వీల్‌ చైర్లను అందజేశారు. 

ఈ సందర్భంగా ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ  ప్రవాసభారతీయుడు పొట్లూరి రవి కుటుంబసభ్యులను సాదరంగా ఆహ్వానించారు. ఆసుపత్రిలోని 500 పైగా రోగులకు బ్రెడ్ పాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం బాలకృష్ణ ఆధ్వర్యంలో 30 వీల్ చైర్లను అందించారు. చేతన ఫౌండేషన్ సహకారంతో జరిగిన కార్యక్రమంలో ఫౌండేషన్ ఛైర్మన్ రవి వెనిగళ్ల, కోఆర్డినేటర్ రంగారావు, ముప్పా రాజశేఖర్, పొట్లూరి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని