Updated : 16/06/2021 12:16 IST

NRIsForAmaravtiకి ‘సెయింట్ లూయిస్’ ప్రవాసాంధ్రుల విరాళం

సెయింట్‌ లూయిస్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. రాజధాని అమరావతి కోసం తాము చేసిన భూ త్యాగం వృథా కాకుడదని రైతన్నలు ఉద్యమ బాట పట్టారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని నిలబెట్టుకునేందుకు వారు చేస్తున్న పోరాటానికి ప్రవాసాంధ్రుల నుంచి ఆపన్న హస్తం అందుతోంది. అన్నదాతల ఉద్యమానికి ‘మనం సైతం’ అనే నినాదంతో జయరాం కోమటి అమెరికాలోని ప్రవాసాంధ్రుల్లో చైతన్యం రగిలించారు. అమెరికాలోని ప్రవాసాంధ్రులు.. అమరావతి రైతులు, మహిళల కష్టాలు చూసి చలించిపోయారు. సెయింట్‌ లూయిస్‌కు చెందిన రాజా సూరపనేని.. అమరావతి రైతన్నల ఉద్యమానికి ఆర్థికంగా సాయం చేయాలని సంకల్పించారు. ఈ క్రమంలోనే తొలి విడతలో సెయింట్‌ లూయిస్‌లోని తెలుగువారి సాయంతో 22,200 డాలర్లను సేకరించారు. ఈ మొత్తాన్ని ‘NRIsForAmaravati’ కోశాధికారికి చెక్కు రూపంలో అందించారు. అంతేకాకుండా ‘ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని’ నినాదంతో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. రైతులకు, మహిళలకు తమ వంతు సహాయ సహకారాలుంటాయని ఈ సందర్భంగా ‘సెయింట్ లూయిస్’ ప్రవాసాంధ్రులు ప్ర‌తిజ్ఞ చేశారు. రజనికాంత్‌ గంగవరపు, కిషోర్‌ యార్లగడ్డ, సందీప్‌ గంగవరపు, కిషోర్‌ ఎరపోతిన, వంశీ పాతూరి చేసిన కృషిని ప్రవాసాంధ్రులు అభినందించారు. అదేవిధంగా తమకు అండగా నిలిచిన సెయింట్‌ లూయిస్‌ ప్రవాసాంధ్రులకు అమరావతి రైతులు, మహిళలు ధన్యవాదాలు తెలిపారు.

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని