శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్ జనరల్‌గా డాక్టర్ శ్రీకర్ కె రెడ్డి
అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నూతన కాన్సులేట్ జనరల్‌గా మరో తెలుగు వ్యక్తి నియమితులయ్యారు.
శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నూతన కాన్సులేట్ జనరల్‌గా మరో తెలుగు వ్యక్తి నియమితులయ్యారు. భారత్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్‌లో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న డాక్టర్ శ్రీకర్ కె రెడ్డి (IFS) నూతన కాన్సులేట్ జనరల్(CGI)గా నియమితులయ్యారు. పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ, కామర్స్, స్థానిక ఎన్నారైల సమస్యలపై దృష్టిసారిస్తానన్నారు. ప్రవాస భారతీయులందరితో సత్సంబంధాలు నెరిపేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ప్రవాస భారతీయులతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. నూతన కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎంపికైన శ్రీకర్‌కు ప్రవాస భారతీయులు శుభాకాంక్షలు తెలిపారు.
యాదాద్రి జిల్లాలోని మోత్కూరు మండలంలోని కొండగడప గ్రామంలో జన్మించిన డాక్టర్ శ్రీకర్ కె రెడ్డి 1996లో కాకతీయ వర్సిటీ వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అనంతరం ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికై తన బ్యాచ్‌లోనే సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. జర్మనీలోని బెర్లిన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయంలో పనిచేసిన ఆయన.. దిల్లీలోని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలోనూ సేవలందించారు. గతంలో కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన డాక్టర్ టి.వి.నాగేంద్ర ప్రసాద్ తర్వాత మరో తెలుగు వ్యక్తి ఆ పదవి చేపట్టడం తెలుగువారికి గర్వకారణమని పలువురు ఎన్నారైలు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: అమీర్‌పేటలో చంద్రబాబుకు మద్దతుగా భారీ ర్యాలీ
-
Apply Now: ‘సింగిల్ గర్ల్ చైల్డ్’కు సీబీఎస్ఈ స్కాలర్షిప్.. దరఖాస్తు చేశారా?
-
Hyderabad: పాతబస్తీలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురికి గాయాలు
-
October 1: దేశవ్యాప్తంగా ‘శ్రమదాన్’.. స్వచ్ఛత కోసం మోదీ పిలుపు
-
Rakshit Shetty: తెలుగు ప్రేక్షకుల ఆదరణకు రక్షిత్ శెట్టి ఫిదా.. ఏమన్నారంటే?
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ