USA: ఉత్సాహభరితంగా సాగిన డీటీఏ వాలీబాల్ టోర్నమెంట్

అమెరికాలో డీటీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్‌ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. మొత్తం 300 మందికి పైగా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

Published : 15 Aug 2023 16:49 IST

వాషింగ్టన్‌: అమెరికాలోని మిడ్‌వెస్ట్‌ రీజియన్‌లో అతిపెద్ద టోర్నమెంట్‌గా భావించే డీటీఏ వాలీబాల్‌ (Vollyball) పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. డీటీఏ అధ్యక్షుడు కిరణ్‌ దిగ్గిరాల నేతృత్వంలో నిర్వహించిన ఈ పోటీలకు ఉదయ్‌ చాపలమడుగు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన 30 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. అమెరికా, కెనడా నుంచి దాదాపు 300కిపైగా క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీల్లో న్యూజెర్సీకి చెందిన ఎన్‌బీ కింగ్స్‌ విజయం సాధించింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫార్మింగ్టన్ ఫైటర్స్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో 19-21, 21-19, 13-15 పాయింట్ల తేడాతో గెలుపొందింది.

ఈ టోర్నమెంట్‌ విజయవంతమయ్యేందుకు డీటీఏ అధ్యక్షుడు కిరణ్‌ దుగ్గిరాల, అతడి బృందం ఎంతో కృషి చేసింది. ఈ క్రీడాపోటీల సంచాలకులు శివ జుజ్జవరపు, సుధీర్‌ బచ్చు, తనుజ్ రెడ్డి వంచా గత మూడు నెలలుగా అందర్నీ సమన్వయ పరుస్తూ అవసరమైన ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమానికి తానా పూర్వ బోర్డు అధ్యక్షుడు హనుమయ్య బండ్ల, తానా జాయింట్‌ ట్రెజరర్‌ సునీల్‌ పంట్ర, ఎస్‌వి బోర్డ్‌ ట్రస్టీ జోగేశ్వరరావు పెద్దిబోయిన, రాజా చెన్నుపాటి, ఉదయ్‌ చేపలమడుగు, శివరామ్ యార్లగడ్డ, డీటీఏ మాజీ అధ్యక్షుడు నీలిమ మన్నె, ద్వారకా ప్రసాద్ బొప్పన తదితరులు హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్న క్రీడాకారులతోపాటు, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన డెట్రాయిట్‌ తెలుగు సంఘం నాయకులను, వాలంటీర్లను అభినందించారు.

ఈ సందర్భంగా డెట్రాయిట్ తెలుగు సంఘం అధ్యక్షులు కిరణ్ దుగ్గిరాల మాట్లాడుతూ ఇలాంటి గొప్ప మెగా టోర్నమెంట్‌ను నిర్వహించి విజయవంతం చేసిన కార్యకర్తలను, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను, క్రీడాకారులను అభినందించారు. అలాగే డెట్రాయిట్ తెలుగు సంఘం పూర్వ నాయకత్వం ఇచ్చిన సహాయ సహకారాలను గుర్తు చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను చేస్తూ డెట్రాయిట్ తెలుగు సంఘానికి పూర్వ వైభవం తీసుకొస్తానని ప్రతిజ్ఞ చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు