
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఎన్నారైల సమరభేరి
ఇంటర్నెట్ డెస్క్: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ అధ్యక్షుడు జయరామ్ కోమటి తెలిపారు. ఈ మేరకు అమెరికాలోని భారత దౌత్య కార్యాలయాల్లో మొమొరాండాలు సమర్పిస్తామని చెప్పారు. అలాగే, ఇతర దేశాల్లోని దౌత్య కార్యాలయాల్లో సైతం వీటిని అందించి విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దనే తమ డిమాండ్‌ను బలంగా వినిపిస్తామన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మకానికి వ్యతిరేకంగా భారీ ఉద్యమం చేపడతామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. ఆంధ్రుల హక్కుగా భాసిల్లిన స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ యత్నాలను అడ్డుకుని తీరతామని పేర్కొన్నారు. ఇప్పటికే అమరావతి ఉద్యమంలో ఎన్నారైలు చురుగ్గా పాల్గొంటున్నారని జయరామ్ కోమటి తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.