ఫిన్లాండ్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

ఫిన్లాండ్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో అక్టోబరు 2వ తేదీన ఫిన్లాండ్‌లో దసరా, బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఫిన్లాండ్‌లోని అన్ని ప్రాంతాల నుంచి దాదాపు 400కుపైగా పెద్దలు, చిన్నారులు హాజరయ్యారు. ఆటపాటలతో సద్దుల బతుకమ్మను సందడిగా జరుపుకొన్నారు.

Published : 04 Oct 2022 17:46 IST

ఫిన్లాండ్‌: ఫిన్లాండ్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో అక్టోబరు 2వ తేదీన ఫిన్లాండ్‌లో దసరా, బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఫిన్లాండ్‌లోని అన్ని ప్రాంతాల నుంచి దాదాపు 400కుపైగా పెద్దలు, చిన్నారులు హాజరయ్యారు. ఆటపాటలతో సద్దుల బతుకమ్మను సందడిగా జరుపుకొన్నారు. తెలుగువారితో పాటు స్థానికులు కూడా బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో పెద్దలు, పిల్లలు కలిసి బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఫిన్లాండ్ తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు రఘునాథ్‌ పార్లపల్లి, సుబ్రహ్మణ్యమూర్తి, జ్యోతి స్వరూప్ అనుమాలశెట్టి, సత్యనారాయణ కంచెర్ల తెలిపారు. భవిష్యత్తులో 1000 మంది పాల్గొనే విధంగా పెద్దఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తామని శ్రీవల్లి అడబాల, రోజా రమణి మొలుపోజు, వినయ్ శింగపురం, స్పందన ఈచూరి, శ్రుతి కొత్రిక్, వాసు దాసరి, వెంకట్ వారణాసి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని