TracyHills : ట్రేసీహిల్స్‌లో సందడిగా గణేశ్ ఉత్సవాలు

కాలిఫోర్నియాలోని ట్రేసీహిల్స్‌లో గణేశ్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మండపంలో వినాయకుడి ప్రతిమను ఏర్పాటు చేసి ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా పలువురు భక్తులు భజన కీర్తనలు ఆలపించారు.

Published : 07 Sep 2022 17:02 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : కాలిఫోర్నియాలోని ట్రేసీహిల్స్‌లో గణేశ్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మండపంలో వినాయకుడి ప్రతిమను ఏర్పాటు చేసి ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా పలువురు భక్తులు భజన కీర్తనలు ఆలపించారు. చిన్నారుల నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ట్రేసీ పోలీస్‌ బృంద సభ్యులు కూడా ఉత్సవాల్లో పాల్గొని నృత్యాలు చేశారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు తెలియజేయడానికి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని వాలంటీర్ల బృందం తెలిపింది. దాదాపు వెయ్యి మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని