IN PICS: వర్జీనియాలో వైభవంగా గణేశ్‌ నిమజ్జనోత్సవం

భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొనే అతి ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. ఏటా జరిగే ఈ వేడుకలను ఇక్కడి ప్రజలతో పాటు విదేశాల్లో నివసించే.......

Updated : 13 Sep 2021 20:50 IST

వర్జీనియా: భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొనే అతి ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. ఏటా జరిగే ఈ వేడుకలను ఇక్కడి ప్రజలతో పాటు విదేశాల్లో నివసించే ప్రవాస భారతీయులూ ఎంతో వైభవంగా జరుపుకొంటారు. అమెరికాలోని వర్జీనియాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన నిమజ్జనోత్సవంలో పలువురు ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అనంతరం ప్రసాదాలను పంచి పెట్టారు. అనంతరం గణనాథుడి ప్రతిమను ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు, మహిళలు కాషాయ జెండాలను పట్టుకొని ఊరేగింపులో పాల్గొన్నారు. నిమజ్జనోత్సవంలో పిల్లలు, పెద్దలు అంతా ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు నిరంజన్‌ శృంగవరపు, ఆటా అధ్యక్షుడు భువనేష్‌, జీడబ్ల్యూటీసీఎస్‌ అధ్యక్షురాలు సాయిసుధ, కాట్స్‌ అధ్యక్షురాలు సుధా కొండపు, శ్రీధర్‌ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని