షికాగోలో గణేశ్‌ నిమజ్జనం.. హోరాహోరీగా సాగిన లడ్డూవేలం

అమెరికాలోని షికాగోలో ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ షికాగో (ఐఏజీసీ) ఆధ్వర్యంలో

Published : 11 Sep 2022 12:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలోని షికాగోలో ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ షికాగో (ఐఏజీసీ) ఆధ్వర్యంలో వారంరోజుల పాటు గణేశ్‌ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన గణపతి లడ్డూ వేలంపాట హోరాహోరీగా జరిగింది. తానా మిడ్‌ వెస్ట్‌ రీజినల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హను చెరుకూరి గణేశ్‌ లడ్డూను దక్కించుకున్నారు.

ఈ కార్యక్రమాన్ని ఐఏజీసీ ప్రెసిడెంట్‌ మల్లారెడ్డి, ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ మనోజ్‌ సింగంశెట్టి, హరిందర్‌రెడ్డి పులియాల, ప్రవీణ్‌ కొండూరు, హీనా త్రివేది, నిలేశ్‌ తోపీవాలా ఆధ్వర్యంలో నిర్వహించారు. లడ్డూ వేలం విజయవంతం అయ్యేందుకు తానా షికాగో నేతలు హేమ కానూరు, కృష్ణ మోహన్‌, చాందినీ దువ్వూరి, చిరంజీవి గల్లా, రవి కాకర, సతీశ్‌ మచ్చ సహకరించారు. నిమజ్జనం సందర్భంగా హెలికాప్టర్‌ పైనుంచి వినాయకుడిపై కురిపించిన పూలవర్షం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గణపతి ఉత్సవాల సందర్భంగా చిన్నారులకు కాన్వాస్‌ పెయింట్‌ పోటీలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విజేతలకు తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ, కాంగ్రెస్‌ రిప్రజెంటేటివ్‌ రాజా కృష్ణమూర్తి వారికి బహుమతులు అందజేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని