Updated : 08/01/2020 14:32 IST

ఇరాక్‌లోని భారత పౌరులారా.. జాగ్రత్త..!

దిల్లీ: అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. మిలిటరీ కమాండర్‌ సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు చేసింది. దీంతో మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ట్రావెల్‌ అడ్వైజరీ జారీ చేసింది. 

ఇరాక్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం భారత పౌరులు ఆ దేశానికి వెళ్లకుండా ఉంటే మంచిదని హెచ్చరించింది. తదుపరి నోటిఫికేషన్ వచ్చేంతవరకు ఇరాక్‌కు ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. అంతేగాక ఇరాక్‌లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయట తిరగకూడదని వెల్లడించింది. బాగ్దాద్‌, ఎర్బిల్‌లోని మన ఎంబసీలు అక్కడి భారత పౌరులకు అన్ని విధాల అండగా ఉంటాయని పేర్కొంది. 

మరోవైపు తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విమానయాన సంస్థలకు ప్రభుత్వం హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్‌, ఇరాక్‌, గల్ఫ్‌ గగనతలంలోకి విమానాలు వెళ్లొద్దని కేంద్రం ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. 

ఇవీ చదవండి..

అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడి

క్షిపణి దాడుల్లో 80 మంది మృతి?

ఇద్దరి అడుగులు యుద్ధం వైపే..


Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని