Published : 02/03/2020 22:10 IST

 అగ్నిప్రమాద బాధితులకు నాట్స్ సాయం 

ఇర్వింగ్: అమెరికాలోని ఇర్వింగ్లో జరిగిన అగ్ని ప్రమాదంపై నాట్స్ శరవేగంగా స్పందించింది. భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతంలో జరిగిన ఈ అగ్నిప్రమాదంపై నాట్స్ అత్యవసర సహాయ బృందం రంగంలోకి దిగి బాధితులకు సాయం అందించింది. నాట్స్ నాయకులు బాపునూతి, రాజేంద్ర మాదలతో పాటు పలువురు నాట్స్ బృంద సభ్యులు ఈ ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే ఘటనాస్ధలికి చేరుకున్నారు. బాధితులు చాలావరకు తమ విలువైన డాక్యుమెంట్లను కూడా కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుగు విద్యార్ధులు ఇక్కడే గదులు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు, ప్రాణహాని జరగకుండా సురక్షితంగా బయటపడ్డారు. కానీ ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగింది. బాధితులకు తమ వంతు సాయం చేస్తామని నాట్స్‌ నాయకులు భరోసా ఇచ్చారు. అసలు ప్రమాదానికి కారణాలేమిటనేదానిపై స్థానిక అధికారులు విచారణ చేస్తున్నారు. బాధితులకు కావాల్సిన సహాయ సహకారాలు మరికొద్ది రోజుల పాటు అందించనున్నామని నాట్స్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి తెలిపారు. తెలుగువారికి అమెరికాలో ఏ ఆపద వచ్చినా నాట్స్ అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు.

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని