Updated : 17 Mar 2020 17:50 IST

నేనూ పరీక్షలు చేయించుకోవాల్సి రావొచ్చు:ట్రంప్‌

అమెరికాను అతలాకుతలం చేస్తున్న కరోనా

వాషింగ్టన్‌: కరోనా వైరస్(కొవిడ్‌-19) అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకీ చాపకింద నీరులా దేశమంతా విస్తరిస్తోంది. తొలి రోజుల్లో అంతా సవ్యంగానే ఉందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించినా.. చివరకు ‘ఆరోగ్య ఆత్యయిక స్థితి’ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతటితో ఆగకుండా చివరకు తాను కూడా పరీక్షలు చేయించుకోవాల్సి రావొచ్చని స్వయంగా ట్రంపే తెలిపారు. అయితే, తనకు ఇప్పటి వరకు వైరస్‌ లక్షణాలు మాత్రం లేవని స్పష్టం చేశారు.  

కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ట్రంప్‌ ఆ దేశంలో ఆరోగ్య అత్యయిక పరిస్థితి(హెల్త్‌ ఎమర్జెన్సీ)ని ప్రకటించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు 5 వేల కోట్ల డాలర్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన శ్వేతసౌధంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. అయితే ఇటీవల కరోనా వైరస్‌ బారిన పడ్డట్లు గుర్తించిన పలువురు ప్రముఖులు గతంలో ట్రంప్‌ని కలిశారు. దీంతో ‘‘కరోనా వైద్య పరీక్షలు మీరు(ట్రంప్‌) చేయించుకున్నారా’’ అని విలేకరులు ట్రంప్‌ని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఆయన ‘‘నేను పరీక్షలు చేయించుకోనని చెప్పలేదు. చేయించుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి’’ అని వ్యాఖ్యానించారు.

ట్రంప్‌ ఇటీవల బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సోనారో సహా ఆయన కమ్యూనికేషన్‌ చీఫ్‌ ఫాబియోను కూడా కలిశారు. అయితే తాజాగా ఫాబియోకు వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. బోల్సోనారోకు జరిపిన పరీక్షల్లో మాత్రం నెగెటివ్‌ రావడం గమనార్హం. దీనిపై ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘‘నేను దాదాపు రెండు గంటలపాటు బోల్సోనారో కలిసి ఉన్నాను. ఇద్దరం కలిసి భోజనం చేశాం. చాలా సమయం పాటు పక్కపక్కనే కూర్చున్నాం. కానీ ఆయనకు వైరస్‌ నెగెటివ్‌ వచ్చింది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు’’ అని వ్యాఖ్యానించారు.

ట్రంప్‌ ఆరోగ్యం బాగానే ఉందని శ్వేతసౌధం గతవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని.. ఇప్పట్లో పరీక్షలు చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పుకొచ్చింది. తాజాగా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం రావొచ్చని ట్రంప్‌ అనడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అమెరికాలో ఇప్పటి వరకు 41 మంది మరణించగా.. 1,678 మందికి వైరస్ సోకింది.     

మరోవైపు ఆస్ట్రేలియా హోం మంత్రి పీటర్‌ డుటన్‌కూ కరోనా సోకింది. కొద్ది రోజుల కిందట ఆయన అమెరికా వెళ్లి, ట్రంప్‌ కుమార్తె ఇవాంక, అటార్నీ జనరల్‌ విలియమ్‌ బార్‌తో సమావేశమై వచ్చారు.

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని