
ఈలియట్ పురస్కార రేసులో భాను కపిల్
లండన్: ప్రముఖ ఆంగ్లకవి టి.ఎస్.ఈలియట్ పురస్కారానికి కుదించిన పది మంది జాబితాలో భారత సంతతికి చెందిన భాను కపిల్‌కు చోటు దక్కింది. ఇంగ్లాండ్‌లో పుట్టి... లండన్‌లో పెరిగిన కపిల్.. ‘హౌ టు వాష్ ఏ హార్ట్’ కవితతో ప్రాచుర్యం పొందారు. ఆరు పుస్తకాలు రాశారు. ఈ ఏడాది ఆరంభంలోనే కవితల విభాగంలో విందామ్-కాంపెల్ బహుమతిని సొంతం చేసుకున్నారు. టి.ఎస్.ఈలియట్ పురస్కారాన్ని చాలా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. విజేతకు 25 వేల పౌండ్లు. కుదించిన జాబితాలో చోటు దక్కిన వారికి 1500 పౌండ్లు అందజేస్తారు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.