Updated : 02 Dec 2020 10:45 IST

ప్రవాస భారతీయులకూ ఈ-పోస్టల్‌ బ్యాలెట్‌

 ఎన్నికల సంఘం ప్రతిపాదన

దిల్లీ: ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులకు అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ సిస్టమ్‌(ఈటీపీబీఎస్‌)ను ప్రవాస భారతీయులకూ విస్తరించాలని ఎన్నికల సంఘం(ఈసీ) కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు లేఖ రాసింది. త్వరలో జరగనున్న అసోం, పశ్చిమబెంగాల్‌, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల్లో ఈటీపీబీఎస్‌ బ్యాలెట్‌ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఏప్రిల్‌-జూన్‌లో ఎన్నికలు జరిగే అవకాశముంది. ప్రవాస భారతీయులు తమ ప్రాంతంలో జరిగే ఓటింగ్‌కు హాజరుకావడం లేదు. వారు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఓటు వేయడం కూడా శ్రమ, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ నేపథ్యంలో ఈటీపీబీఎస్‌ విధానాన్ని అమలు చేయడం ద్వారా వారికి ప్రయోజనకరంగా ఉంటుందని ఎన్నికల సంఘం భావిస్తోంది.

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని