Updated : 04/01/2021 08:33 IST

లాస్‌ ఏంజెలెస్‌లో అంత్యక్రియలకూ కటకట

మృతదేహాలను వెనక్కి పంపుతున్న కేంద్రాలు
అమెరికాలో కొవిడ్‌ ఉద్ధృతి

లాస్‌ ఏంజెలెస్‌: అమెరికాలో కొవిడ్‌ కల్లోలం కొనసాగుతోంది. మహమ్మారి దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. సగటున రోజుకు 2,500కు పైగా మరణాలు నమోదవుతున్నాయి. లాస్‌ ఏంజెలెస్‌ నగరంలోని అంత్యక్రియల కేంద్రాల్లోనైతే మృతదేహాల నిల్వకూ చోటు సరిపోవట్లేదు. మా వల్ల కాదంటూ నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. ‘‘నేను 40 ఏళ్లుగా అంత్యక్రియలకు సంబంధించిన రంగంలో ఉన్నాను. మృతదేహాలను తీసుకొచ్చే కుటుంబాలను.. మేం అంత్యక్రియలు నిర్వహించలేమంటూ వెనక్కి పంపే రోజులొస్తాయని ఎన్నడూ ఊహించలేదు. కానీ ప్రస్తుతం ఆ పని చేయక తప్పట్లేదు’’ అని స్థానిక కాంటినెంటల్‌ ఫ్యునరల్‌ హోం యజమాని మగ్దా మాల్డొనాడో తెలిపారు. ప్రస్తుతం తమ కేంద్రంలో సగటున రోజుకు 30 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సాధారణ రోజులతో పోలిస్తే ఈ సంఖ్య ఆరు రెట్లు ఎక్కువ అని పేర్కొన్నారు. అంత్యక్రియల కేంద్రాలన్నింటిలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొందన్నారు. లాస్‌ ఏంజెలెస్‌లో ఆస్పత్రులకు కూడా కరోనా బాధితులు వెల్లువలా వస్తున్నారు. రోగులకు సరిపడా ఆక్సిజన్‌ అందుబాటులో ఉండట్లేదు. లూసియానా, టెక్సాస్‌ సహా పలు ఇతర రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య ఇటీవల భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

టీవీ దిగ్గజం ల్యారీ కింగ్‌కు కరోనా
అమెరికాకు చెందిన దిగ్గజ టీవీ ప్రయోక్త, ‘ల్యారీ కింగ్‌ లైవ్‌’ టాక్‌ షోతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ల్యారీ కింగ్‌(87) కరోనా బారినపడ్డారు. వైరస్‌ లక్షణాలతో వారం రోజులుగా ఆయన లాస్‌ ఏంజెలెస్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు అమెరికా మీడియా సంస్థలు ఆదివారం వెల్లడించాయి.

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని